పిల్లలను దత్తత తీసుకోనున్న సమంత..! | Samantha Ruth Prabhu Is Decid Adopt Children | Sakshi
Sakshi News home page

Samantha: పిల్లలను దత్తత తీసుకోనున్న సమంత.. నిజమేనా?

Nov 23 2023 7:56 AM | Updated on Nov 23 2023 8:50 AM

Samantha Ruth Prabhu Is Decid Adopt Children - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్‌తో ఇబ్బంది పడటం వల్ల సినిమాలకు తాత్కాలిక బ్రేక్‌ ఇచ్చింది. అనారోగ్యంతో పోరాడుతున్న ఈ స్టార్‌ నటి ఎంతో బలంగా తిరిగి నిలదొక్కుకుంటుంది. తన ట్రీట్‌మెంట్‌లో భాగంగా కొద్దిరోజుల క్రితం భూటాన్‌లో ఆయుర్వేద చికిత్సను తీసుకుంది. సమంత పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆమె ఫ్యాన్స్‌ కూడా ఆశిస్తున్నారు. సమంత హీరోయిన్‌గా మాత్రమే గుర్తింపు పొందలేదు..  తనలో మంచి సేవాగుణం ఉందని  కొందరికే తెలుసు.

దక్షిణాది అగ్రహీరోలందరితోనూ వరుస సినిమాలు చేసిన ఈ అగ్రతార కొన్నేళ్ల క్రితం ప్రత్యూష సపోర్ట్‌  అనే స్వచ్చంద సేవా సంస్థ ఏర్పాటు చేసి చిన్నారులకు వైద్యం అందజేస్తోంది. గుండెజబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నపిల్లలకు చికిత్స అందేలా సమంత చూశారు. అంతేకాదు ప్రాణాపాయ వ్యాధులకు కూడా వైద్యం అందిస్తున్నారు సమంత. ఇదంతా తను ఏర్పాటు చేసిన ప్రత్యూష సపోర్టు అనే స్వచ్చంద సహకారంతో ఆమె చేశారు.

సమంత సుమారుగా 11 ఏళ్లుగా ఈ సంస్థను నడుపుతోంది. ఈ సంస్థ మహిళలు, బాలబాలికల  సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఈ కారణంగానే సామ్ ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఎందరో చిన్నారులకు అండగా నిలబడిన సమంత... త్వరలో ఇద్దరు చిన్నారలను దత్తత తీసుకుని వారి ఆలనాపాలన చూసుకునే బాధ్యతను తీసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ సమంత మాత్రం ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 

2017లో అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న సమంత పలు కారణాల వల్ల 2021 నుంచి ఆయనతో దూరంగా ఉంటున్నారు.  ఐదారేళ్లుగా ప్రేమించుకుని తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకున్న ఈ జంట అభిమానులకు భంగపాటు కలిగించింది. వారిద్దరూ విడిపోయాక సమంతపై  కొందరు ట్రోల్స్‌ చేస్తూ ఆమెను క్షోభకు గురిచేశారు. అదే సమయంలో రెండో పెళ్లి చేసుకోవాలని సమంత తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారని ప్రచారం జరిగింది. మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని సమంతను వారు సూచించినా ఆమె సున్నితంగా  వద్దని చెప్పారట. అలా రెండో పెళ్లి ఆలోచనే లేదని తల్లిద్రండ్రులకు సమంత చెప్పేసిందని ప్రచారం జరిగింది. ఈ విషయం పట్ల కూడా సమంత ఇప్పటి వరకు ఎక్కడా స్పందించలేదు. 


  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement