ఈ ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే: హీరోయిన్ సమంత | Love From Home Just Hits Different: Samantha Ruth Prabhu Comments On Chennai Fans Love - Sakshi
Sakshi News home page

Samantha: ప్రేమ గురించి సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్

Published Sat, Feb 17 2024 7:01 PM

Samantha Ruth Prabhu Comments On Chennai Fans Love - Sakshi

హీరోయిన్ సమంత  చాలారోజుల తర్వాత ప్రేమ గురించి మాట్లాడింది. ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. అలానే కొన్ని గ్లామరస్ ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ సామ్.. ప్రేమ గురించి ఏం చెప్పింది? ఎందుకు చెప్పింది?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

'ఏ మాయ చేశావె' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. మహేశ్, ఎన్టీఆర్ సినిమాల్లో చేసి హిట్స్ కొట్టింది. స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ వచ్చిన సామ్‌కి గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేదు. అలానే మయాసైటిస్ బారిన పడటంతో నటనకు గ్యాప్ ఇచ్చింది. కొన్నాళ్ల ముందు కోలుకోవడంతో మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవ్వాలని చూస్తోంది.

ఈ క్రమంలోనే గ్లామరస్ ఫొటోల్ని పోస్ట్ చేస్తూ రీఎంట్రీ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తోంది. తాజాగా సమంత తన సొంతూరు చెన్నై వెళ్లింది. అక్కడే ఉన్న సత్యభామ యూనివర్సిటీలో ఓ ఈవెంట్‌లో పాల్గొంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేసిన సామ్.. 'సొంతూరిలో దక్కే ప్రేమ ఎప్పుడు ప్రత్యేకమే' అని క్యాప్షన్ పెట్టింది. కెరీర్ విషయానికొస్తే.. సమంత నటించి 'సిటాడెల్' వెబ్ సిరీస్ రిలీజ్ కావాల్సి ఉంది. 

(ఇదీ చదవండి: సమంత అందాల జాతర.. నడుము ఒంపుసొంపులతో అనన్య!)

Advertisement
 
Advertisement
 
Advertisement