Samantha Ruth Prabhu And Vijay Devarakonda's Kushi Movie Shooting Video Leaked - Sakshi
Sakshi News home page

పెళ్లి కూతురి లుక్​లో​ సమంత.. వీడియో వైరల్‌

Jul 6 2023 7:19 AM | Updated on Jul 6 2023 8:46 AM

Samantha Ruth Prabhu And Vijay Devarakonda Kushi Movie Shooting Video Leak - Sakshi

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం 'ఖుషి'. ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ ఆఖరి షెడ్యూల్‌ తాజాగా ద్రాక్షారామ పరిసర ప్రాంతాల్లో మొదలైంది. ఇందులో భాగంగా ప్రస్తుతం విజయ్‌, సమంతలపై క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. అందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.

అందులో గమనిస్తే  అక్కడ అందరూ ఓ యాగం చేస్తున్నట్లు కనిపించారు. ఓ వైపు సమంత, విజయ్​ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించగా.. మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్ లాంటి స్టార్స్​ కూడా ఆ షూట్​లో కనిపించారు.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'సలార్' టీజర్ విడుదల)

'ఖుషి'లోని కొన్ని సన్నివేశాల్లో విజయ్-సమంత భార్య భర్తలుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. సమంత 'ఖుషి' సెట్స్ నుంచి సెల్ఫీ తీసుకుని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా స్టోరీలో పోస్ట్ చేశారు. అందులో ఆమె మెడలో నల్లపూసలు కనిపించాయి. విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన వీడియోలో కూడా సేమ్ శారీలో సమంత కనిపించారు.  ఇప్పటికే విడుదలైన 'నా రోజా నువ్వే...' పాటు సూపర్‌ హిట్‌ అందుకుంది. వచ్చే వారంలో రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

(ఇదీ చదవండి; జ్యువెల్లరీ యాడ్‌లో సితార.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)

విభిన్న నేపథ్యాలు కలిగిన ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథ ఇది. ఈ సినిమాలో సమంత ముస్లిం యువతి పాత్ర చేస్తున్నారని తెలుస్తోంది. విజయ్‌ - సామ్‌ల కెమిస్ట్రీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement