మరో మాస్‌ సాంగ్‌కి సమంత సై.. ‘ఊ అంటావా’ మించేలా ! | Samantha Ready To Another Mass Song For Yashoda Movie | Sakshi
Sakshi News home page

Samantha: మరో మాస్‌ సాంగ్‌కి సమంత సై.. ‘ఊ అంటావా’ మించేలా !

Jul 16 2022 7:17 PM | Updated on Jul 16 2022 7:17 PM

Samantha Ready To Another Mass Song For Yashoda Movie - Sakshi

సమంత కెరీర్ లో మిగితా సినిమాలన్ని ఒక ఎత్తు. పుష్ప సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌ ఊ అంటావా మరో ఎత్తు. ఎందుకంటే ఈ ఒక్క సాంగ్ ఆమెకు పాన్ ఇండియా ఫేవరేట్ హీరోయిన్ గా మార్చింది. సల్మాన్ ఖాన్ కు కూడా ఈ పాటంటేనే బాగా ఇష్టం.బాలీవుడ్ ఎందరో ప్రముఖులు సమంత పాటకు స్టెప్పులేశారు.ఇప్పుడు ఇదంతా ఎందుకంటరా.. త్వరలో సామ్‌  మరోసారి ఇలాంటి సాంగ్‌లో కనిపించబోతుదంట. 

(చదవండి: సోషల్‌ మీడియాకు దూరంగా సమంత.. అసలేమైంది?)

ప్రస్తుతం సమంత యశోద అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ఓ పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తైందని ఇటీవలే యూనిట్‌ తెలిపింది. ప్రస్తుతం ఆ పాటను సమంతపై చిత్రీకరిస్తోంది యూనిట్. హైదారబాద్ లో వేసిన ప్రత్యేమైన సెట్ లో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. మణిశర్మ అందించిన మాస్ సాంగ్ కు మాస్ స్టెప్స్ వేస్తోందట సమంత. ఈ పాట ఊ అంటావా ను మంచి ఉండేలా యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. సమంత కెరీర్ లో యశోద  తొలి పాన్ ఇండియా ఫిల్మ్. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement