సమంత మా ఇంటి బంగారం.. డిలీటేడ్ సీన్స్ చూశారా? | Samantha Maa Inti Bangaaram Deleted Scenes Video Goes Viral | Sakshi
Sakshi News home page

సమంత మా ఇంటి బంగారం.. డిలీటేడ్ సీన్స్ ఇవే..!

Jul 3 2026 5:15 PM | Updated on Jul 3 2026 5:18 PM

Samantha Maa Inti Bangaaram Deleted Scenes Video Goes Viral

టాలీవుడ్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి ముఖ్యంగా మహిళ ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఏకంగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో సామ్ తన యాక్షన్‌తో అభిమానులను ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా ఇంకా థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే తాజాగా ఈ మూవీలోని డీలీటెడ్ సీన్స్‌ను షేర్ చేశారు మేకర్స్. ఇప్పటికే థియేటర్లలో నవ్వులు పూయించిన మా ఇంటి బంగారం సీన్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన డిలీటేడ్ సీన్స్ తెగ నవ్వులు తెప్పిస్తున్నాయి. ఈ వీడియోలో సెట్‌లో సరదా సన్నివేశాలు సామ్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఆ వీడియో చూసేయండి. 


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement