Samantha heading to South Korea for Myositis treatment? Here's the Truth - Sakshi
Sakshi News home page

Samantha: సమంత ఆరోగ్యంపై పుకార్లు.. అసలు నిజమేంటంటే?

Nov 30 2022 5:04 PM | Updated on Nov 30 2022 5:40 PM

Is Samantha Heading to South Korea for Myositis, Here is the Truth - Sakshi

సమంత పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్తుందంటూ నెట్టింట వార్తలు వైరల్‌గా మారాయి..

ఇటీవలు యశోద సినిమాతో సక్సెస్‌ అందుకుంది హీరోయిన్‌ సమంత. మయోసైటిస్‌ అనే కండరాల సంబంధిత వ్యాధి బారిన పడిన ఆమె ఇప్పుడే కోలుకుంటోంది. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్తుందంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో సామ్‌ ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. అయితే ఇవన్నీ వట్టి వదంతులు మాత్రమేనని ఆమె వ్యక్తిగత టీమ్‌ కొట్టిపారేసింది.

సమంత దక్షిణ కొరియాకు వెళ్లడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎలాంటి సమాచారం లేకుండా ఒకరి ఆరోగ్యం గురించి ఇలా ఏది పడితే అది ఎలా రాస్తారని సామ్‌ టీమ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె అనారోగ్యం నుంచి కోలుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోందని స్పష్టం చేసింది. అనవసరంగా తన ఆరోగ్యం గురించి వదంతులు సృష్టించవద్దని కోరింది.

చదవండి: ఈ సినిమాలో తమన్నాను అందుకే తీసుకున్నాం: నిర్మాత
పుష్ప సినిమాలో హీరో ఎవరో తెలియదు: సీనియర్‌ హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement