Actress Samantha Emotional Post On Yashoda Movie, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha: చాలా నెర్వస్‌గా ఉంది.. సామ్‌ పోస్ట్‌ వైరల్‌.. అలా మారిపోయిదేంటి?

Nov 10 2022 2:46 PM | Updated on Nov 10 2022 3:42 PM

Samantha Emotional post On Yashoda, Pic Goes Viral - Sakshi

సమంత ప్రస్తుతం మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.

సమంత ప్రస్తుతం మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. తాను నటించిన ‘యశోద’ మూవీ కోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టింది.  ఏదో రకంగా సినిమాకి మాత్రం హైప్‌ వచ్చేలా చేసింది.  రేపు(నవంబర్‌ 11) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా తాజాగా సామ్‌ తన ఇన్‌స్టా ఖాతాలో పెట్టిన ఓ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అయింది. 

(చదవండి:  సమంతకు మరో టెన్షన్‌.. ఇదే సరైన సమయం)

‘చాలా నెర్వస్‌గా ఉంది కానీ ఎక్సయిట్ అవుతున్నా! ఇంకా ఒక్కరోజే ఉంది. మీ అందరికి యశోద నచ్చాలని గట్టిగా కోరుకుంటున్నా. మీ తీర్పు కోసం నాలాగే నా దర్శకులు, నిర్మాతలు, సినిమా యూనిట్ మొత్తం వెయిట్ చేస్తోంది' అంటూ తన లేటెస్ట్ ఫోటోని షేర్‌ చేసింది. ప్రస్తుతం సామ్‌ పిక్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ఈ పిక్‌లో ఆమె సమంత‌లా కనిపించటం లేదు.. పూర్తిగా  మారిపోయింది. ఆమె చేతులు, వేళ్ళకు ఉన్న ముడతలు చూసి పాపం సమంత ఏంటి ఇలా అయిపోయిందని అభిమానులు బాధ పడుతున్నారు.  త్వరగా కోలుకుని ఎప్పటిలానే ఆమె సినిమాలు చేయాలని.. ప్రార్థనలు చేస్తున్నారు. 

 శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ‘యశోద’ చిత్రానికి హరి, హరీష్‌ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం  శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement