కాజల్‌ డ్రెస్‌పై కామెంట్‌ చేసిన సమంత | Samantha Akkineni Comments On Kajal Aggarwal Outfit | Sakshi
Sakshi News home page

కాజల్‌ డ్రెస్‌పై కామెంట్‌ చేసిన సమంత

Feb 27 2021 2:30 PM | Updated on Feb 27 2021 2:38 PM

Samantha Akkineni Comments On Kajal Aggarwal Outfit - Sakshi

తాజాగా కాజల్‌.. పాస్టెల్ గ్రీన్‌ ట్రౌజర్‌ సూట్‌లో కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా, హీరోయిన్‌ సమంత కామెంట్‌ చేసింది.

నటి కాజల్‌ అగర్వాల్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ పోస్ట్‌ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటారు. తాజాగా ఆమె పాస్టెల్ గ్రీన్‌ ట్రౌజర్‌ సూట్‌లో కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా, హీరోయిన్‌ సమంత కామెంట్‌ చేసింది. లవ్లీ అంటూ హార్ట్‌ సింబల్‌ను పోస్ట్‌ చేసింది. దీంతో వీరిద్దరి స్నేహానికి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. కాజల్‌-సమంత బృందావనం, జనతా గ్యారజ్‌, బ్రహ్మోత్సవం వంటి సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. దీంతో వెండితెరపైనే కాకుండా రియల్‌ లైఫ్‌లోనూ వీరిద్దరి మధ్యా మంచి అనుబంధం ఉంది. సినిమా రిలీజ్‌, ప్రత్యేకమైన వేడుకల్లో ఒకరికి ఒకరు బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తూ ఉంటారు.


ప్రస్తుతం కాజల్‌ మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాలో నటిస్తుండగా, రామ్‌ చరణ్‌ ఇందులో గెస్ట్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఇక సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌-2 విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత ఓ  పీరియాడికల్‌ చిత్రంలో నటిస్తుంది. దుష్యంతుడు–శాకుంతల ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ వచ్చే నెలలో ఆరంభం కానుంది. 

చదవండి : (తనకున్న వ్యాధి గురించి చెప్పిన కాజల్‌)
(స్పెషల్‌ డే ఫర్‌ సమంత; జీవితాన్నే మార్చేసింది!)

Advertisement
 
Advertisement
Advertisement