స్పెషల్‌ డే ఫర్‌ సమంత; జీవితాన్నే మార్చేసింది! | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ లవ్‌ కదా.. అంత ఈజీగా తగ్గదు: సమంత

Published Fri, Feb 26 2021 5:56 PM

Samantha Celebrating 11th Anniversary Of Ye Maya Chesave Movie - Sakshi

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంతకు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. తన జీవితంలో ఓ సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది ఈరోజే. ఆమె నటించిన తొలి సినిమా విడుదలై నేటికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఏమాయా చేసావే సినిమాతో ఇండస్ట్రీలో కాలుమోపి విజయవంతంగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ కుందనపు బొమ్మ‌ కుర్రకారుని తన మాయలో పడేసింది. ఈ సినిమా సమంత జీవితాన్నే మలుపుతిప్పిందని చెప్పవచ్చు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మంజుల ఘట్టమనేని నిర్మించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఇందులో నాగచైతన్య సరసన నటించిన సమంత తరువాత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. 

ఇండస్ట్రీలోకి వచ్చి పదకొండేళ్లు కంప్లీట్‌ చేసుకున్న సందర్భంగా సమంత స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేశారు. ‘సినిమా.. ఫస్ట్‌ లవ్‌ కదా. అంత ఈజీగా తగ్గదు. హ్యపీ యానివర్సరీ టూ మీ. 11 ఏళ్లు పూర్తయ్యాయి. అండ్‌ హ్యపీ యానివర్సరీ టూ యూ. నా జర్నీలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీరు లేకుండా ఇదంతా సాధించలేను. ఎన్నో జ్ఞపకాలు ఉన్నాయి. ఇది చాలా చాలా ప్రత్యేకం’ అని భావోద్వేగానికి లోనయ్యారు. అదే విధంగా తన మీద నమ్మకంతో సినిమా అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు గౌతమ్‌ మీనన్‌, నాగచైతన్యకు ధన్యవాదాలు తెలిపారు.
చదవండి: శాకుంతల సిద్ధమవుతున్నారు

ఇక ఈ పదకొండేళ్ల  ప్రయాణంలో సమంత ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లను ఎదుర్కొని సౌత్‌ ఇండస్ట్రీలోనే స్టార్‌ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్నారు. అట్టర్‌ ఫ్లాప్‌ల నుంచి అద్భుత విజయాల వరకు అన్నీ ఆమె ఖాతాలో భాగమే. కేవలం నటిగానే కాకుండా ప్రత్యూష ఫౌండేషన్‌ ద్వారా సేవ చేస్తూ మంచి వ్యక్తిగా కూడా పేరొందారు. కాగా ఏమాయ చేసావేతో ప్రేమలో పడిన చైతూ, సమంత కొన్నేళ్లు ప్రేమించుకొని 17 ఆక్టోబర్ 2017లో పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కారు. పెళ్లి అనంతరం సినిమాలే కాకుండా వెబ్‌ సిరీస్‌లు, పలు బిజినెస్‌లతో తమిళ పొన్ను బిజీగా గడుపుతున్నారు. 
చదవండి: ఆస్కార్ బరిలో సూర్య సినిమా.. భారత్‌ నుంచి ఆ ఒక్కటే

ఇక అది అలా ఉంటే ఆమె ఇటీవల గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసింది. ఈ సినిమా షూటింగ్ మార్చి 20 నుండి మొదలుకానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషలలోను విడుదల చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్యాన్‌  ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో ఓ మలయాళ నటుడు కనిపిస్తారని టాక్‌. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.

Advertisement
 
Advertisement