ప్రతి కణం కణం... | Salman Khan: Tiger 3 2nd Song release | Sakshi
Sakshi News home page

ప్రతి కణం కణం...

Nov 8 2023 12:17 AM | Updated on Nov 8 2023 12:17 AM

Salman Khan: Tiger 3 2nd Song release - Sakshi

సల్మాన్‌ ఖాన్, కత్రినా కైఫ్‌

టైగర్, జోయాల ప్రేమ బలమైనది. ప్రేయసి మీద తనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ‘మెరిసే నీ కనులే.. ముసిరే నీ కనులే..’, ‘ప్రతి కణం.. కణంలో...’ అంటూ పాట అందుకున్నారు టైగర్‌. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ‘టైగర్‌ జిందా హై’కి సీక్వెల్‌గా రూపొందిన ‘టైగర్‌ 3’లోని పాట ఇది. టైగర్‌గా సల్మాన్‌ ఖాన్, జోయాగా కత్రినా కైఫ్‌ నటించగా మనీష్‌ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చొప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రంలోని రెండో పాట ‘ప్రతి కణం కణం..’ను మంగళవారం రిలీజ్‌ చేశారు. ‘‘ఈ పాట టైగర్, జోయాల అన్యోన్యతను ఆవిష్కరించే విధంగా ఉంటుంది. ఆ కెమిస్ట్రీని సిల్వర్‌ స్క్రీన్‌పై చూసి, అనుభూతి చెందాల్సిందే. అందుకే వీడియోను ముందుగా రిలీజ్‌ చేయలేదు’’ అన్నారు ఆదిత్యా చొప్రా. ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement