'సలార్‌' ప్రమోషన్స్‌ కోసం భారీ స్కెచ్‌.. త్వరలో అసలు గేమ్‌ స్టార్ట్‌ | Sakshi
Sakshi News home page

'సలార్‌' ప్రమోషన్స్‌ కోసం భారీ స్కెచ్‌.. త్వరలో అసలు గేమ్‌ స్టార్ట్‌

Published Thu, Dec 14 2023 3:08 PM

Salaar movie promotions With SS Rajamouli - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్  దర్శకత్వంలో వస్తున్న సలార్‌ సినిమాపై  ప్రమోషన్స్‌ కార్యక్రమాలు స్టార్ట్‌ అవుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యం చేసిన చిత్ర యూనిట్‌ తాజాగా దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే మొదటి సాంగ్‌ విడుదలైంది. స్నేహం గురించి తెలుపుతూ విడుదలైన ఆ పాటపై మంచి రెస్పాన్స్‌ వస్తుంది. డిసెంబర్‌ 22న విడుదల కానున్న ఈ చిత్రం టికెట్స్‌ బుకింగ్స్‌ కూడా రేపటి (డిసెంబర్‌ 15) నుంచి ప్రారంభం అవుతాయని సలార్‌ మేకర్స్‌ ప్రకటించారు. భారీ  యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా తెరికెక్కిన సలార్‌పై ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

'సలార్‌' చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ కోట్లాది రూపాయలతో నిర్మించింది. దేవ- వరదరాజ్ మన్నార్ స్నేహానికి సంబంధించిన కథను ప్రశాంత్‌ నీల్ ఈ చిత్రంలో వివరించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మంచి బజ్‌ను క్రియేట్‌ చేసింది. కానీ ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో మేకర్స్‌ నిర్లక్ష్యం కనిపించడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కూడా ఫైర్‌ అయ్యారు. సాధారణంగా హోంబలే సంస్థ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తుంది. ఆ సంస్థ ప్రచార వ్యూహాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే సినిమాపై భారీ బజ్‌ క్రియేట్‌ చేసేందుకు డైరెక్టర్‌ రాజమౌళిని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు రాజమౌళితో హోంబలే సంస్థకు మంచి అనుబంధం ఉంది. గతంలో 'కేజీఎఫ్' చాప్టర్-1 తెలుగు ఈవెంట్‌కు జక్కన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పుడు 'సాలార్' టీమ్‌ని ఇంటర్వ్యూ చేయడానికి రాజమౌళి రెడీ అవుతున్నాడు. ప్రభాస్‌తో పాటు ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లను ఆయన త్వరలో ఇంటర్వ్యూ చేయనున్నారు. రాజమౌళి, ప్రభాస్‌ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.. గతంలో ‘రాధేశ్యాం’ సినిమా విడుదల సందర్భంగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ప్రభాస్ పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు. అక్కడి నుంచి ఆ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకులకు బాగా రీచ్‌ అయింది.

ఇప్పుడు 'సలార్' ప్రమోషన్ విషయంలోనూ అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు మేకర్స్‌. రాజమౌళి ఇంటర్వ్యూని న్యూస్ ఛానల్స్‌కి విడిగా ఇవ్వకుండా అన్ని తెలుగు ఛానల్స్‌లో ప్రసారం చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ సినిమాలకు కలెక్షన్స్‌ వస్తున్నప్పటికీ అంతగా ప్రేక్షకులను మెప్పించలేదని చెప్పాలి. వరుస పరాజయాలతో ఉన్న ప్రభాస్‌కు సలార్‌తో సూపర్‌ హిట్‌ కొట్టాలని ఉన్నాడు.

Advertisement
Advertisement