బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన బిగ్ బాస్ బ్యూటీ! | Sakshi Agarwal Get A Chance To Act In Bollywood Cinema Soon | Sakshi
Sakshi News home page

Sakshi Agarwal: వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న సాక్షి.. త్వరలోనే బాలీవుడ్‌ ఎంట్రీ!

Nov 15 2023 12:14 PM | Updated on Nov 15 2023 12:28 PM

Sakshi Agarwal Get A Chance To Acts In Bollywood Cinema Soon

ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా ఉన్న హీరోయిన్ సాక్షి అగర్వాల్‌.  తమిళం, మలయాళం, కన్నడతో వంటి పలు భాషా చిత్రాలు ఉన్నాయి. బిగ్‌ బాస్‌ రియాల్టీ గేమ్‌ షో ద్వారా పాపులర్‌ అయిన సాక్షి అగర్వాల్‌ హీరోయిన్‌, గ్లామర్‌, యాక్షన్‌, విలనిజం, గ్రామీణ యువతిలాగా అన్ని రక రకాల పాత్రలో నటిస్తూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం తమిళంలో రజిత్‌ కన్నా దర్శకత్వం వహిస్తున్న హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రం సారా లో నటిస్తున్నారు.

అదేవిధంగా 8 బుల్లెట్స్ చిత్రం ఫేమ్‌ వెట్రికి జంటగా నటించిన చిత్రంను పూర్తి చేశారు. ఇది కాకుండా సాక్షి అగర్వాల్ చేతిలో 'అతిథి 2'తో పాటు చాలా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. కాగా మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి మేనల్లుడు హీరోగా నటిస్తున్న చిత్రంలో సాక్షి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో ఈమె పల్లెటూరి యువతిగా కనిపించనున్నారు.

అదేవిధంగా ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు బి అజనీష్‌ లోకనాథ్‌ నిర్మిస్తున్న చిత్రంలోనూ ఈమె చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇలా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న సాక్షి అగర్వాల్‌కు తాజాగా బాలీవుడ్‌ అవకాశాలు వస్తున్నాయట. సాక్షి అగర్వాల్ త్వరలో ఓ బాలీవుడ్ చిత్రంలో కూడా నటించనుంది. మొత్తం మీద ఈ దీపావళి ఈ బ్యూటీకి కొత్త ఆనందాన్నే తీసుకొచ్చినట్లుంది. 

Advertisement
 
Advertisement
Advertisement