RRR Movie: కొమ్మా ఉయ్యాల కోన జంపాల.. ఫుల్‌ వీడియో సాంగ్‌ చూశారా?

RRR Movie: Komma Uyyala Full Video Song Out Now - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఇందులో బ్రిటీష్‌ దొరసాని ఓ చిన్నారిని ఎత్తుకుపోవడంతో కథ మొదలవుతుంది. అందమైన గొంతుతో అందరినీ హత్తుకునేలా పాట పాడుతూ బ్రిటీష్‌ దొరసాని చేతికి డిజైన్‌ వేస్తుంటుంది మల్లి. ఆమె టాలెంట్‌కు మంత్రముగ్ధురాలైన ఆమె తిరిగి కోటకు వెళ్లేటప్పుడు మల్లిని అన్యాయంగా లాక్కుని పోవడంతో సినిమా ప్రారంభమవుతుంది.

ఈ సినిమాలో మల్లి పాడే కొమ్మా ఉయ్యాల.. కోన జంపాల.. పాట సూపర్‌ హిట్టయ్యింది. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌ 'కొమ్మా ఉయ్యాల' ఫుల్‌ వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో మల్లిని ఎత్తుకుపోయే దగ్గర నుంచి ఆమె బందీ అయిన క్షణాలు, ఎన్టీఆర్‌ ఆమెను భుజానెక్కించుకుని తిరిగిన సందర్భాలను చూపించారు. ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను చిన్నారి ప్రకృతి రెడ్డి అద్భుతంగా ఆలపించింది. 

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌లో ఆ సీన్స్‌ హైలైట్‌, కొన్ని సన్నివేశాల్లో ఏడ్చేశాను

తెలుగు హీరోలకు పర భాష డైరెక్టర్ల వణక్కమ్‌.. నమస్కార..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top