Prabhas Review On RRR Movie: I Got Tears While Watching 10 Scenes, Deets Inside - Sakshi
Sakshi News home page

Prabhas Review On RRR: ఆర్‌ఆర్‌ఆర్‌లో ఆ సీన్స్‌ హైలైట్‌, కొన్ని సన్నివేశాల్లో ఏడ్చేశాను

Apr 16 2022 2:46 PM | Updated on Apr 16 2022 3:16 PM

Prabhas Review On RRR Movie: I Got Tears While Watching 10 Scenes - Sakshi

నేను ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం చూశాను. చాలా బాగా నచ్చింది. దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన కొద్ది చిత్రాల్లో ఇది ఒకటి. దాదాపు 10 సన్నివేశాల్లో నా కళ్లలో...

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల సునామీని సృష్టించిన విషయం తెలిసిందే. మార్చి 25న రిలీజైన ఈ పాన్‌ ఇండియా మూవీ ఇప్పటివరకు ఏకంగా రూ.1050 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమా అద్భుతంగా ఉందంటూ సౌత్‌ నుంచి బాలీవుడ్‌ దాకా అందరూ కొనియాడారు. అయితే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ మాత్రం ఈ సినిమాపై ఆలస్యంగా స్పందించాడు.

తాజాగా ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'నేను ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం చూశాను. చాలా బాగా నచ్చింది. దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన కొద్ది చిత్రాల్లో ఇది ఒకటి. ఆర్‌ఆర్‌ఆర్‌ రూ.1100 కోట్లు సాధించే దిశగా వెళ్తోంది. ఈ సినిమా గొప్ప అనుభూతిని మిగిల్చింది. దాదాపు 10 సన్నివేశాల్లో నా కళ్లలో నీళ్లు తిరగ్గా... 50 సీన్లు నన్ను కట్టిపడేశాయి. ఈ సినిమా చాలా బాగుంది' అని ప్రభాస్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: ఈ 3 సినిమాల కోసం ఓటీటీల్లో ఫ్యాన్స్ వెయిటింగ్‌..

మీ లిప్‌ సైజ్‌ ఎంత ?.. శ్రుతి హాసన్‌ స్ట్రాంగ్ కౌంటర్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement