Sakshi News home page

రోషన్‌  లీడ్‌ రోల్‌లో వృషభ షురూ

Published Mon, Jul 24 2023 5:41 AM

Roshan And mohan lal vrushabha shooting launch - Sakshi

మోహన్‌ లాల్‌ ప్రధాన పాత్రలో, రోషన్‌  లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ద్విభాషా చిత్రం (తెలుగు, మలయాళం) ‘వృషభ’. నందకిశోర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, రాగిణి ద్వివేది, జహ్రా ఎస్‌ ఖాన్‌ , షానయ కపూర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అభిషేక్‌ వ్యాస్, ఏక్తా కపూర్, విశాల్‌గుర్నాని, జుహీ పరేహ్‌ మెహతా, శ్యామ్‌ సుందర్, శోభాకపూర్, వరుణ్‌ మాథుర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశానికి నటి ఊహ క్లాప్‌ కొట్టారు. మోహన్‌ లాల్, రోషన్‌ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట నందకిశోర్‌. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. తెలుగు, మలయాళంతో పాటు తమిళం, కన్నడం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement
Advertisement