
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45 వద్ద ఉన్న ఆయన నివాసం వైపునకు వేగంగా కారు దూసుకెళ్లింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
Road Accident At Balakrishna Home In Jubilee Hills: టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45 వద్ద ఉన్న ఆయన నివాసం వైపునకు వేగంగా కారు దూసుకెళ్లింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తర్వాత బాలకృష్ణ ఇంటివైపునకు వెళ్లిన కారు ఆయన ఇంటిగేట్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటన మంగళవారం (మే 17) సాయంత్రం చోటుచేసుకుంది.
అయితే అంబులెన్స్‌కు దారి ఇచ్చే క్రమంలో యువతి కారును డివైడర్‌పైకి ఎక్కించింది. దీంతో బాలకృష్ణ ఇంటిగేటు వైపునకు కారు దూసుకెళ్లింది. బాలకృష్ణ ఇంటి ముందు రోడ్డు ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా జనాలు భారీగా గుమిగూడారు. దీంతో అక్కడ కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి వాహనాలను పంపించివేశారు.