Fact Check: Hero Nandamuri Balakrishna Knee Surgery, Details here - Sakshi
Sakshi News home page

Nandamuri Balakrishna: రెగ్యులర్‌ చెకప్‌ కోసం హాస్పిటల్‌కు బాలకృష్ణ

Apr 26 2022 8:38 AM | Updated on Apr 26 2022 10:57 AM

Nandamuri Balakrishna Undergoes Another Knee Surgery - Sakshi

'అఖండ' సినిమా చిత్రీకరణలో జరిగిన ఓ ప్రమాదంలో బాలకృష్ణ కుడిభుజానికి గాయకావడంతో హైదరాబాద్‌ కేర్‌ హాస్పిటల్‌ వైద్యులు శస్ర్త చికిత్స చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బాలకృష్ణ....

ఇటీవల విడుదలైన 'అఖండ' సక్సెస్‌తో మంచి ఫామ్‌లో ఉన్నారు నందమూరి బాలకృష్ణ. వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బాలకృష్ణకు మరోసారి శస్త్ర చికిత్స జరిగిందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు సర్జరీ చేశారంటూ సోషల్‌ మీడియాలో ఓ కథనం వైరల్‌గా మారింది. తాజాగా ఇది అసత్యవార్తగా తేలిపోయింది.

బాలయ్యకు సర్జరీ జరగలేదని, కేవలం రెగ్యులర్‌ చెకప్‌ కోసం ఆస్పత్రికి వెళ్లారని బాలయ్య సన్నిహితులు పేర్కొన్నారు. గతంలో 'అఖండ' సినిమా చిత్రీకరణలో జరిగిన ఓ ప్రమాదంలో బాలకృష్ణ కుడిభుజానికి గాయకావడంతో హైదరాబాద్‌ కేర్‌ హాస్పిటల్‌ వైద్యులు శస్త్ర చికిత్స చేసిన విషయం తెలిసిందే. 

చదవండి: బోయపాటితో మరో మూవీ.. కానీ బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన బాలయ్య!



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement