‘రివైండ్‌’లో నటించినందుకు గర్వంగా ఉంది: హీరో సాయిరోనక్‌ | Rewind Movie Release Date Out | Sakshi
Sakshi News home page

‘రివైండ్‌’లో నటించినందుకు గర్వంగా ఉంది: హీరో సాయిరోనక్‌

Oct 6 2024 11:04 AM | Updated on Oct 6 2024 11:46 AM

Rewind Movie Release Date Out

‘‘ఒక మంచి కథతో ‘రివైండ్‌’ సినిమా చేశాం. కల్యాణ్‌గారు మంచి కథతో ఈ సినిమా తీసినందుకు గర్వంగా ఉంది’’ అని హీరో సాయిరోనక్‌ అన్నారు. కల్యాణ్‌ చక్రవర్తి దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం ‘రివైండ్‌’. సాయి రోనక్, అమృతా చౌదరి జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. 

ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సాయి రోనక్‌ మాట్లాడుతూ.. ‘ చిన్న టీం అయినా ఒక మంచి లైన్తో మంచి స్క్రిప్ట్ తయారుచేసుకొని ఈ సినిమాని చేసాం. మాకున్న బడ్జెట్, లైన్ అప్ తో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కంటెంట్ ని తయారు చేశాం. ప్రేక్షకులు అందరు ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’అన్నారు.  

కల్యాణ్‌ చక్రవర్తి మాట్లాడుతూ– ‘‘టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో తీసిన ప్రేమకథా చిత్రమిది. స్క్రీన్‌ప్లే బాగా కుదిరింది’’ అని తెలిపారు. ‘‘నాకు, మా డైరెక్టర్, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్‌.. మా అందరికీ ‘రివైండ్‌’ తొలి చిత్రం’’ అని అమృతా చౌదరి పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement