ఇండియన్‌ 2 ఫ్లాప్‌ అయినందుకు సంతోషం: రేణు దేశాయ్‌ | Renu Desai Sensational Comments on indian 2 Movie | Sakshi
Sakshi News home page

Renu Desai: ఆ మూవీ ఫ్లాప్‌ అయినందుకు హ్యాపీ.. తెలివిలేని వాళ్లు..

Sep 7 2024 8:47 PM | Updated on Sep 8 2024 12:46 PM

Renu Desai Sensational Comments on indian 2 Movie

భారతీయుడు సినిమా ఎంత హిట్టో దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన భారతీయుడు 2 అంత ఫ్లాప్‌గా నిలిచింది. కమల్‌ హాసన్‌- శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో విడుదలవగా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ మూవీ వీక్షించిన నటి రేణు దేశాయ్‌ సినిమా టీమ్‌పై ఫైర్‌ అయింది. ఇటువంటి సినిమాలు ఫ్లాప్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. 

చాలా సంతోషం
ఆమె ఇలా మాట్లాడటానికి అందుకు కారణం లేకపోలేదు. ఈ సినిమాలో వీధికుక్కలను హీనంగా చూసే డైలాగ్‌ ఉంటుంది. ఆ క్లిప్పింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసిన రేణు దేశాయ్‌.. తెలివితక్కువ రచయితలు ఇలాంటి డైలాగ్స్‌ ఎలా రాస్తారు? అసలు వాళ్లకు ఏమైంది? అని మండిపడింది. ఇకపోతే ఇండియన్‌ 2తో ట్రోలింగ్‌ బారిన పడ్డ శంకర్‌ తర్వాతి పార్ట్‌ విషయంలో అయినా జాగ్రత్త వహిస్తే బెటర్‌ అని నెటిజన్లు సూచిస్తున్నారు!

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement