Ravi Teja's Eagle to commence new schedule in London - Sakshi
Sakshi News home page

లండన్‌లో వాలిపోయిన 'ఈగల్‌'

Aug 22 2023 1:31 AM | Updated on Aug 22 2023 10:40 AM

Ravi Teja Eagle to commence new schedule in London - Sakshi

రవితేజ మోస్ట్‌ వాంటెడ్‌.. హీరోగా ఇండస్ట్రీకి మోస్ట్‌ వాంటెడ్‌. ‘ఈగల్‌’ సినిమాలో కూడా రవితేజ మోస్ట్‌ వాంటెడ్‌. సినిమాలో ఆయన్ను పట్టుకోవడానికి ‘రా’ ఏజెన్సీ వెతుకుతుంటుంది. కొందరు ఆయన్ను పెయింటర్‌ అనుకుంటారు.. మరికొందరు రైతు అనుకుంటారు.. ఇంకొందరు ఇంకోటి అనుకుంటారు.

సో.. ఈ చిత్రంలో రవితేజ పలు గెటప్స్‌లో కనిపిస్తారని ఊహించవచ్చు. రవితేజ, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఈగల్‌’. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ లండన్‌లో ప్రారంభమైంది. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: దవ్‌జాంద్, కెమెరా–ఎడిటింగ్‌: కార్తీక్‌ ఘట్టమనేని, సహనిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

Advertisement
 
Advertisement
Advertisement