
ఇప్పటికే రష్మిక అహ్మదాబాద్‌కు పయనమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ర
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలి.. ఇది చిరంజీవి సినిమాలోని పాట. ఈ పాటను అక్షరాలా నిజం చేసేందుకు క్రికెటర్లు రెడీ అయ్యారు. ఐపీఎల్ వేదికపై తమ సత్తా ఏంటో చూపించేందుకు సై అంటున్నారు. క్రికెట్ అభిమానుల ఫేవరెట్ ఐపీఎల్‌ను ఘనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది బీసీసీఐ. ఇందులో భాగంగానే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మిల్కీ బ్యూటీ తమన్నాలను రంగంలోకి దింపింది.
ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకల్లో ఈ ఇద్దరు హీరోయిన్లు లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇందుకోసం ఇప్పటికే రష్మిక అహ్మదాబాద్‌కు పయనమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రష్మిక పర్ఫామెన్స్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఐపీఎల్ విషయానికి వస్తే.. మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ ఐకానిక్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ 16వ సీజన్ ప్రారంభం కానుంది.
రష్మిక విషయానికి వస్తే పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా వరుసగా బాలీవుడ్ సినిమాలు చేసింది. కానీ ఏదీ అంతగా కలిసిరాలేదు. అమితాబ్‌తో చేసిన గుడ్‌బై, ఓటీటీలో రిలీజైన మిషన్ మజ్ను కూడా రష్మికకు హిట్ ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం ఆమె హిందీలో యానిమల్ సినిమా చేస్తుండగా ఇది ఆగస్టు 11న విడుదల కానుంది. మరోవైపు తెలుగులో నితిన్, వెంకీ కుడుముల సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Rash 😍 #rashmikamandanna papped at Mumbai airport off to ahemdabad for #ipl opening ceremony#telugucinecraft #telugu_cinecraft @TCinecraft #Trending #TCinecraft @iamRashmika @Geethamadam @RashmikaTrends pic.twitter.com/WsgPoaCZ66
— Telugu cinecraft (@TCinecraft) March 30, 2023