Rashmika Mandanna: సమంత స్పెషల్ సాంగ్‌పై రష్మిక ఆసక్తికర కామెంట్స్

Rashmika Mandanna About Samantha Special Song In Pushpa Movie: వరుస సినిమాలతో టాప్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్న రష్మిక మందన్నా నటించిన లేటెస్ట్ మూవీ 'పుష్ప'. డిసెంబర్17న ఈ చిత్రం ఫస్ట్ పార్ట విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న రష్మిక పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌తో నటించాలనుకున్న తన కోరిక నెరవేరిందని, శ్రీవల్లి క్యారెక్టర్ కొత్త అనుభూతినిచ్చిందని తెలిపింది.
ఇక ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేయడంపై మాట్లాడుతూ.. సూపర్‌స్టార్‌గా రాణిస్తూనే, స్పెషల్ సాంగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ చూసి షాకయ్యా. సాంగ్ షూట్ అవగానే అద్భుతంగా చేశావని సామ్‌కి మెసేజ్ పంపించా. అయితే ఇలాంటి అవకాశం నాకు వస్తే మాత్రం చేస్తానో లేదో కశ్చితంగా చెప్పలేను అని రష్మిక తెలిపింది.