తెలుగు అమ్మాయితో ‘దీప్‌వీర్‌’ స్మాషింగ్‌ టైమ్‌ | Ranveer and Deepika smashing Time with PV Sindhu | Sakshi
Sakshi News home page

Ranveer and Deepika: ‘దీప్‌వీర్‌’తో సరదాగా గడిపిన పీవీ సింధు

Sep 12 2021 2:19 PM | Updated on Sep 12 2021 3:22 PM

Ranveer and Deepika smashing Time with PV Sindhu - Sakshi

‘దీప్‌వీర్‌’ అంటే తెలియని ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి లేదు. నటులు దీపికా పదుకొనే, రణ్‌వీర్‌ సింగ్‌ జంటని అలా ముద్దుగా పిలుచుకుంటారు అభిమానులు. ఇప్పుడు ఈ కపుల్‌ బాడ్మింటన్‌ సంచలనం, తెలుగమ్మాయి పీవీ సింధుతో ‘స్మాషింగ్‌ టైమ్‌’ అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. రియో డి జనీరోలో జరిగిన 2016 సమ్మర్ ఒలింపిక్స్ తర్వాత ఒలింపిక్స్‌లో ఆమెకి ఇది మరో పతకం. పతకం గెలిచిన తర్వాత ఎంతోమంది ప్రముఖులు ఆమెను అభినందించారు. కొందరు ఆమెను ప్రత్యేకంగా కలిసి తమ సంతోషాన్ని తెలియజేశారు.

తాజాగా పీవీ సింధు, దీపికాతో సరదాగా గడిపిన పిక్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు రణ్‌వీర్‌ సింగ్‌. దానికి ‘స్మాషింగ్‌ టైమ్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. దీంతో ఆ ఫోటో వైరల్‌గా మారింది. దానికి ‘మీతో గడపడంతో ఎంతో బావుంది. మళ్లీ కలవాలని ఉంది’ అంటూ సింధు రిప్లై ఇచ్చింది. కాగా రియల్‌ జంట మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ ‘83’లో రీల్‌ కపుల్‌గా నటిస్తున్నారు. అయితే ‘జయేశ్‌భాయ్‌ జోర్దార్‌’, ‘సర్కాస్‌’ మూవీస్‌లో నటిస్తుండగా, ది ఇంటర్న్ హిందీ రీమేక్‌లో దీపికా బీగ్‌ బీ అమితాబ్ బచ్చన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement