Rangabali Promotions: Comedian Satya And Naga Shaurya Hilarious Spoof Interview, Video Viral - Sakshi
Sakshi News home page

Comedian Sathya Spoof Interview Video: ‘గెటౌట్‌ ఆఫ్‌ మై స్టూడియో’.. నవ్వులు పూయిస్తున్న సత్య-నాగశౌర్య ఇంటర్వ్యూ

Published Wed, Jul 5 2023 1:20 PM

Rangabali: Comedian Satya, Naga Shaurya Hilarious Interview Spoof - Sakshi

నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటించిన తాజా చిత్రం ‘రంగబలి’.పవన్‌ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ఈ నెల 7న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ని వైవిధ్యంగా ప్లాన్‌ చేసింది చిత్రబృందం.

కమెడియన్‌ సత్యతో కలిసి ఓ ఫన్ని  ఇంటర్వ్యూని షూట్‌ చేసింది. టాలీవుడ్‌లో ఇంటర్వ్యూ చేసే పలువురు ప్రముఖులను అనుకరిస్తూ కమెడియన్‌ సత్య అలరించాడు. రిపోర్టర్‌ ‘గ్రాఫర్‌’గా, అలాగే లేడీ యాంకర్‌ ‘వల్లీ’గా సత్య చేసే సందడి నవ్వులు పూయిస్తోంది. ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Advertisement
 
Advertisement