ట్రైలర్‌కి వేళాయె | Ranbir Kapoor Ramayana trailer to be released in USA on July 14 | Sakshi
Sakshi News home page

ట్రైలర్‌కి వేళాయె

Jul 4 2026 4:00 AM | Updated on Jul 4 2026 4:00 AM

Ranbir Kapoor Ramayana trailer to be released in USA on July 14

హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘రామాయణ’. శ్రీరాముడిగా రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్‌ నటిస్తున్నారు. నితేశ్‌ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి నమిత్‌ మల్హోత్రా నిర్మాత. ఈ మూవీ తొలి భాగాన్ని దీపావళి కానుకగా నవంబరులో రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ‘రామాయణ’ ట్రైలర్‌ను అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో ఈనెల 14న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేసేందుకు మేకర్స్‌ ప్రయత్నిస్తున్నార ట. అందులో భాగంగానే ట్రైలర్‌ లాంచ్‌ వేడుకని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌ మీద మునుపెన్నడూ లేని విజువల్స్‌తో ఈ మూవీ రానుంది. ‘రామాయణ’కి హాలీవుడ్‌ సంగీత దర్శకుడు హాన్స్‌ జిమ్మర్, ఇండియన్‌ మ్యుజీషియన్‌ ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement