కూతురికి రూ. 250 కోట్లు గిఫ్ట్‌గా ఇచ్చిన స్టార్‌ హీరో దంపతులు | Ranbir Kapoor And Alia Bhatt Rs 250 Crore Mansion House Gift To Her Daughter | Sakshi
Sakshi News home page

కూతురికి రూ. 250 కోట్లు గిఫ్ట్‌గా ఇచ్చిన స్టార్‌ హీరో దంపతులు

Jun 9 2025 1:13 PM | Updated on Jun 9 2025 3:50 PM

Ranbir Kapoor And Alia Bhatt Rs 250 Crore Mansion House Gift To Her Daughter

తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం కోట్ల ఆస్తిని కూడబెడుతుంటారు. ఇందుకు సెలబ్రిటీలు ఏమీ అతీతులు కాదని చెప్పవచ్చు. బాలీవుడ్‌ జంట రణబీర్ కపూర్, అలియా భట్‌ల (Ranbir Kapoor, Alia Bhatt) ఇల్లు ఎట్టకేలకు పూర్తి అయింది. సుమారు మూడేళ్లుగా ఈ ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముంబైలోని బాంద్రా నడిబొడ్డున ఉన్న ఈ కొత్త ఇంట్లోకి వారు త్వరలో షిఫ్ట్‌ కానున్నారు. సుమారు రూ. 250 కోట్ల విలువ చేసే ఈ ఆస్తిని తన కూతురు రాహా కపూర్‌ పేరుతో ఈ దంపతులు రాశారు.  ఆ ఆస్తికి సంరక్షకురాలిగా రణబీర్‌ కపూర్‌ అమ్మగారు నటి నీతూ కపూర్ పేరుతో రిజిస్టర్‌ చేయించారు. అంత ఆస్తిని తమ పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేపించుకోకుండా కూతురు, అమ్మకు గిఫ్ట్‌గా ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారు.

ఆ ఇంటితో రణబీర్‌ అనుబంధం
వాస్తవంగా ఆ ఇల్లు రణబీర్ కపూర్‌కు వారసత్వంగా వచ్చింది. రాజ్ కపూర్  ఇండస్ట్రీలో పీక్‌లో ఉన్నప్పుడు దానిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత రిషీ కపూర్ అందులోనే ఉన్నారు. అలా వారసత్వంగా ప్రస్తుతం రణబీర్ కపూర్‌ చేతికి ఆ ఆస్తి వచ్చింది. అయితే, దానిని రీమోడలింగ్ చేయించారు. పాత కట్టడాలకు ఎలాంటి డ్యామేజ్‌ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఆరు అంతస్తుల విలాసవంతమైన ఇల్లు నిర్మించారు. మరో రెండు నెలల్లో గృహప్రవేశం చేయనున్నారు.

రణబీర్‌కు ఆ ఇల్లు వారసత్వానికి గుర్తు.. దానిని చాలా సెంటిమెంట్‌గా ఫీల్‌ అవుతాడు. అయితే, తనకు కూతురు పుట్టిన తర్వాత  కెరీర్‌ పరంగా ఆయనకు బాగా కలిసొచ్చింది. దీంతో  దాదాపు రూ. 250 కోట్లకు పైగా ఉన్న ఆ భవనాన్ని కూతురు రాహా పేరుతో రిజిస్ట్రేషన్‌ చేపించాడు. దాంతో బాలీవుడ్‌ కూడా ఆశ్చర్యపోయింది. భవిష్యత్‌లో తన కూతురు ఆ ఇంట్లో ఎలా ఉండాలో అందుకు అనుగుణంగానే ఆయన నిర్మించుకున్నారట. వచ్చే దీపావళిని తన కూతురుతో అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని వారు ప్లాన్‌ చేస్తున్నారట.

Advertisement
 
Advertisement
Advertisement