పవన్‌తో పోరాటం.. రంగంలోకి రానా! | Rana Joins Shoot Of Mult Starrer With Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ వర్సెస్‌ రానా: పోరాటానికి సిద్ధం

Jan 28 2021 7:09 PM | Updated on Jan 29 2021 6:53 PM

Rana Joins Shoot Of Mult Starrer With Pawan Kalyan - Sakshi

మలయాళంలో సూపర్‌ హిట్‌ విజయాన్ని సాధించిన  ‘అయ్యప్పనుమ్ కోషియం’‌ చిత్రాన్ని తెలుగులో పవర్‌స్టార్‌‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న విషయం తెలసిందే. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఎస్‌ఎస్‌ థమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్‌ అందిస్తున్న విషయం విదితమే. ప్రొడక్షన్‌ నెం.12గా నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25 నుంచి ప్రారంభం అయింది. చదవండి: పవన్‌ కల్యాణ్‌ న్యూ లుక్‌ ఫోటోలు వైరల్‌

ఇప్పటికే పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో పాల్గొనగా యాక్షన్ సన్ని వేశాలను ఫైట్ మాస్టర్ దిలీప్ సబ్బరాయన్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు. కాగా నేటి నుంచి పవన్‌తో కలసి రానా షూటింగ్‌లో పాల్గొననున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పదిరోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్ జరపనున్నారు. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో పవన్‌, అతడిని ఎదురించే వ్యక్తిగా రానా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయం పై చిత్రయూనిట్ అంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. చదవండి: ‘విరాటపర్వం’ విడుదల తేదీ ఖరారు

Advertisement
 
Advertisement
Advertisement