థియేటర్ల సంఖ్య తగ్గుతున్నా.. తెలుగు ఇండస్ట్రీ ఎదుగుతోంది: రానా | Rana feels Telugu film industry is emerging when the theatres down | Sakshi
Sakshi News home page

Rana Daggubati: ప్రపంచవ్యాప్తంగా తగ్గినా.. తెలుగు ఇండస్ట్రీ మెరుగ్గానే ఉంది: రానా

Jun 8 2025 1:54 PM | Updated on Jun 8 2025 1:57 PM

Rana feels Telugu film industry is emerging when the theatres down

టాలీవుడ్ హీరో రానా ప్రస్తుతం రానా నాయుడు వెబ్ సిరీస్‌ సీజన్‌-2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలో వచ్చిన సీజన్‌కు అద్భుతమైన స్పందన రావడంతో సీజన్-2 తెరకెక్కించారు. ఈ సూపర్ హిట్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా హీరో రానా ఆసక్తికర కామెంట్స్ చేశారు. థియేటర్లు తగ్గుతున్న కాలంలోనూ  తెలుగు చిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతోందని అన్నారు.   తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన బాహుబలి,  పుష్ప , ఆర్ఆర్ఆర్  లాంటి సినిమాలు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చాయన్నారు.

రానా మాట్లాడుతూ..'ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక విధంగా థియేటర్లు  తగ్గుతున్నాయి.  ఏడేమినిదేళ్ల క్రితం ఉన్న థియేటర్ల సంఖ్య ఇప్పుడు మూడు రెట్లు తగ్గిపోయాయి. దీనికి కారణం  వినోదం అందించేందుకు చాలా ఎక్కువ మాధ్యమాలు ఉన్నాయి. వాటిలో ఓటీటీ, యూట్యూబ్‌, మీ మొబైల్‌ ఫోన్‌ కూడా భాగమైంది. అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమలో సవాళ్లు ఉన్నప్పటికీ సినిమా ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కనిపెడుతూనే ఉంది. ఇటీవల రిలీజైన కోర్ట్‌ మూవీ చిన్న సినిమా అయినా థియేటర్ల వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది.  గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఇలాంటి రోజుల్లో కూడా కోర్ట్ మూవీ కథ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అయింది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమం ఇతర వాటితో పోలిస్తే మెరుగ్గా రాణిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణలో సినిమా షూటింగ్‌లకు అయ్యే ఖర్చు ముంబయి, ఢిల్లీతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటోంది. అది కూడా ఒక అడ్వాంటేజ్‌.' అని అన్నారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలలో బంధుప్రీతి గురించి  మాట్లాడుతూ.. ఏదేమైనా చివరికి మీరు కెమెరా ముందు నిలబడాలి, నటించాలి కదా' అని తెలిపారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement