Rana Daggubati Comments On Dulquer Salmaan At King Of Kotha Pre-Release Event - Sakshi
Sakshi News home page

Rana Daggubati: దుల్కర్‌ టైం వేస్ట్‌ చేసింది.. తన ప్రవర్తనకు చిర్రెత్తుకొచ్చింది, నిర్మాతలను అరగంట తిట్టా..

Aug 14 2023 4:06 PM | Updated on Aug 14 2023 5:59 PM

Rana Daggubati Comments On Dulquer Salmaan At King Of Kotha Pre Release Event - Sakshi

ఆమె తన స్టాఫ్‌తో మూడు, నాలుగు కార్లలో వెళ్తే మనవాడు మాత్రం తన అసిస్టెంట్‌తో చిన్న ఇన్నోవా కారులో వెళ్లిపోయాడు. అప్పుడు నేను సెట్స్‌లో హీరోయిన్‌ ప్రవర్తన గురిం

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన సినిమా 'కింగ్‌ ఆఫ్‌ కోత'. అభిలాష్‌ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్‌, వెఫేరర్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భళ్లాల దేవ రానా దగ్గుబాటి దుల్కర్‌ సహనంపై పొగడ్తలు కురిపిస్తూ ఓ హీరోయిన్‌పై విమర్శలు గుప్పించారు.

షాపింగ్‌ గురించి కబుర్లు
రానా మాట్లాడుతూ.. 'దుల్కర్‌ చాలా పద్ధతైన మనిషి. ఆయన గతంలో ఒక హిందీ సినిమా చేశాడు. దాని నిర్మాతలు నా ఫ్రెండ్సే! ఒకరోజు మా ఇంటి దగ్గరే షూటింగ్‌ జరుగుతుంటే వెళ్లాను. బాలీవుడ్‌లో పెద్ద హీరోయిన్‌ ఆ సినిమాలో నటించింది. నేను సెట్‌కు వెళ్లేసరికి మూడో టేక్‌ తీసుకుంటున్నారు. దుల్కర్‌ ఎండలో నిలబడ్డాడు. ఆమె ఫోన్‌ మాట్లాడుతోంది. ఏమైనా అర్జంట్‌ విషయమా? అంటే ఆమె భర్త లండన్‌లో షాపింగ్‌ చేస్తున్నాడట! ఆ షాపింగ్‌ గురించి మాట్లాడుతోంది. తర్వాత ఫోన్‌ కట్‌ చేసి వచ్చాక నన్ను చూసి హాయ్‌ అంటూ పలకరించింది.

డైలాగులు మర్చిపోతోంది
కెమెరా ముందుకు వెళ్లాక డైలాగులు మర్చిపోతోంది.. అంతలోనే మళ్లీ ఫోన్‌ మాట్లాడుతోంది. ఇదంతా చూసి కోపమొచ్చి నా చేతిలోని బాటిల్‌ నేలకేసి కొట్టాను. దుల్కర్‌ మాత్రం ఓపికగా అలాగే నిల్చుంటూ ఎన్ని టేకులైతే అన్ని టేకులు చేస్తూనే పోయాడు. ప్యాకప్‌ అయిపోయాక ఆమె తన స్టాఫ్‌తో మూడు, నాలుగు కార్లలో వెళ్తే మనవాడు మాత్రం తన అసిస్టెంట్‌తో చిన్న ఇన్నోవా కారులో వెళ్లిపోయాడు. అప్పుడు నేను సెట్స్‌లో హీరోయిన్‌ ప్రవర్తన గురించి లైట్‌ తీసుకుంటున్న నిర్మాతలను అరగంటసేపు తిట్టిన తర్వాత బయటకు వెళ్లిపోయాను. అలాంటి దుల్కర్‌ ఈరోజు వైల్డ్‌ సినిమా చేస్తుంటే నాకన్నా ఎగ్జయిట్‌గా ఎవరూ ఉండరు' అని రానా చెప్పుకొచ్చాడు.

ఆ హీరోయిన్‌ తనేనా?
ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే చాలామంది ఆ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ అని అభిప్రాయపడుతున్నారు. గతంలో వీరిద్దరూ 'ద జోయా ఫ్యాక్టర్‌' అనే సినిమా చేశారు. కాగా సోనమ్‌ 2018లో ఆనంద్‌ అహుజాను పెళ్లాడింది. వీరికి ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ఆస్తులు ఉన్నాయి. లండన్‌లో వీరికి సొంతిల్లు కూడా ఉంది. సోనమ్‌ తరచూ అక్కడికి వెళ్లి వస్తూ ఉంటుంది. సోనమ్‌.. రానా భార్య మిహికా బజాజ్‌కు మంచి స్నేహితురాలు కూడా!

చదవండి: జైలర్‌కు ఈ రేంజ్‌ కలెక్షన్సా? నాలుగోసారి రూ.300 కోట్ల క్లబ్బులో

Advertisement
 
Advertisement
Advertisement