Rajinikanth's Jailer Movie Box Office Collection Day 4 - Sakshi
Sakshi News home page

Jailer Movie: ఊచకోత మొదలుపెట్టిన తలైవా.. రూ. 300 కోట్ల క్లబ్బులో జైలర్‌.. తెలుగులో ఎంతంటే?

Aug 14 2023 2:09 PM | Updated on Aug 14 2023 3:07 PM

Rajinikanth Jailer Movie 4 Days Collections - Sakshi

ఈ క్రమంలో జైలర్‌ థియేట్రికల్‌ హక్కులను కేవలం రూ.12 కోట్లకు మాత్రమే ఇచ్చేశారు. తొలి రోజే సినిమాకు వచ్చిన పెట్టుబడి దాదాపు వచ్చేయగా ఈ నాలుగురోజుల్లో మూడు

బాక్సాఫీస్‌ దగ్గర జైలర్‌ జోరు కొనసాగుతోంది. చాలాకాలంగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న రజనీకాంత్‌కు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ పడింది. ఆగస్టు 10న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజైన ఈ చిత్రం తమిళనాట మాత్రమే కాదు, తెలుగులోనూ భారీగా కలెక్షన్స్‌ రాబడుతోంది. కేవలం నాలుగురోజుల్లోనే ఇక్కడ రూ.32 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. నిజానికి రజనీకాంత్‌ గత సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో జైలర్‌ తెలుగు రైట్స్‌కు పెద్ద ధర పలకలేదు.

తక్కువ బిజినెస్‌.. ఎక్కువ లాభాలు
గతంలో కబాలి సినిమా రైట్స్‌ తెలుగు రాష్ట్రాల్లో రూ.31 కోట్లకు అమ్మారు. రోబో 2.0 సినిమాకు దాదాపు రూ.70 కోట్ల మేర బిజినెస్‌ జరిగింది. కానీ పేట, దర్బార్‌ మాత్రం పదిహేను కోట్లలోపే బిజినెస్‌ జరిగింది. ఈ క్రమంలో జైలర్‌ థియేట్రికల్‌ హక్కులను కేవలం రూ.12 కోట్లకు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ తలైవా సినిమాకు తొలి రోజే పెట్టిన పెట్టుబడి అంతా వచ్చేయగా ఈ నాలుగురోజుల్లో దాదాపు మూడు రెట్ల లాభాలు వచ్చాయి. రానున్న రోజుల్లోనూ కలెక్షన్స్‌ పెరిగే అవకాశం ఉండటంతో నిర్మాతలకు మరింత లాభం చేకూరనుంది.

రూ.300 కోట్ల క్లబ్బులో జైలర్‌
జైలర్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.300 కోట్లు రాబట్టింది. రజనీకి ఈ రికార్డు కొత్తేం కాదు, గతంలో ఆయన నటించిన రోబో 2.0, కబాలి, ఎంతిరన్‌ సినిమాలు సైతం రూ.300 కోట్ల క్లబ్బులో చేరాయి. అయితే జైలర్‌ హవా ఇక్కడితో ఆగిపోయేట్లు కనిపించడం లేదు. లాంగ్‌ రన్‌లో రూ.500 కోట్లు సులువుగా సాధించేట్లు కనిపిస్తోంది. జైలర్‌ సినిమా విషయానికి వస్తే రజనీకాంత్‌, రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌, తమన్నా, ప్రియాంక మోహన్‌, జాకీ ష్రాఫ్‌, మీర్నా మీనన్‌, వసంత రవి ప్రధాన పాత్రలు పోషించారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించగా అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించాడు.

చదవండి: నేనలా అనలేదు, ఇమేజ్‌ దెబ్బ తీయొద్దు: కార్తికేయ

Advertisement
 
Advertisement
Advertisement