Ravi Teja Ramarao On Duty Movie Item Song 'Naa Peru Seesa' Full Song Out Today - Sakshi
Sakshi News home page

Ramarao On Duty - Naa Peru Seesa Song: రామారావు ఆన్‌ డ్యూటీలోని ఐటం సాంగ్‌ రిలీజ్‌!

Jul 2 2022 6:59 PM | Updated on Jul 2 2022 8:28 PM

Ramarao On Duty: Naa Peru Seesa Full Song Out - Sakshi

నా పేరు సీసా సీసా సీసా.. అంటూ సాగే ఈ స్పెషల్‌ సాంగ్‌ను శ్రేయ ఘోషల్‌ పాడింది. సామ్‌ సీఎస్‌ స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యాన్ని అందించాడు. బాలీవుడ్‌ నటి అన్వేషి జైన్‌ ఐటంసాంగ్‌లో స్టెప్పులేసింది.

మాస్‌ మహారాజ రవితేజ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. కెరీర్‌లో ఎన్నడూ లేనంత స్పీడ్‌గా షూటింగ్‌లను పూర్తి చేస్తూ సినిమాలు వీలైనంత త్వరగా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన సినిమాల నుంచి తరచూ ఏదో ఒక అప్‌డేట్‌ బయటకు వస్తోంది. తాజాగా ఆయన నటించిన రామారావు ఆన్‌ డ్యూటీ నుంచి ఐటం సాంగ్‌ రిలీజైంది.

నా పేరు సీసా.. నా పేరు సీసా.. అంటూ సాగే ఈ స్పెషల్‌ సాంగ్‌ను శ్రేయ ఘోషల్‌ పాడింది. సామ్‌ సీఎస్‌ స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యాన్ని అందించాడు. బాలీవుడ్‌ నటి అన్వేషి జైన్‌ ఐటంసాంగ్‌లో స్టెప్పులేసింది. కాగా శ్రీల‌క్ష్మివెంక‌టేశ్వ‌ర సినిమాస్, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ల‌పై సుధాక‌ర్ చెరుకూరితో కలిసి ర‌వితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ సినిమా జూలై 29న రిలీజ్‌ కానుంది.

చదవండి: చోళులు వచ్చేస్తున్నారు అంటూ పోస్టర్‌ రిలీజ్‌
 జనవరి టు జూన్.. ఫస్టాఫ్‌లో అదరగొట్టిన, అట్టర్‌ ఫ్లాప్‌ అయిన చిత్రాలివే!

Advertisement
 
Advertisement
Advertisement