అందమైన ప్రయాణం | Ramani Kalyanam Movie title launch | Sakshi
Sakshi News home page

అందమైన ప్రయాణం

Nov 8 2025 12:44 AM | Updated on Nov 8 2025 12:44 AM

Ramani Kalyanam Movie title launch

దీప్సిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో విజయ్‌ ఆదిరెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘రమణి కళ్యాణం’(Ramani Kalyanam). ‘కోర్ట్‌’ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన రామ్‌ జగదీష్‌ ఈ చిత్రానికి డైలాగ్స్, స్క్రీన్‌ ప్లే అందించడం విశేషం.

ఈ చిత్రం టైటిల్‌ లుక్‌ని కిరణ్‌ అబ్బవరం, వశిష్ట, విజయ్‌ ఆంటోని, జీవీ ప్రకాశ్‌కుమార్‌ తదితర ప్రముఖులు ఆవిష్కరించి, యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘జీవితంలో ఎదురయ్యే సవాళ్ల మధ్య ప్రేమ, విలువలు, బలమైన భావోద్వేగాలతో సాగే అందమైన ప్రయాణంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement