Ram Pothineni To Play Dual Role In Boyapati Srinu Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Ram Pothineni: బోయపాటి కొత్త సెంటిమెంట్‌.. రామ్‌పై వర్కౌట్‌ అవుతుందా?

Jul 6 2022 2:22 PM | Updated on Jul 6 2022 3:38 PM

Ram Pothineni Play Dual Role In Boyapati Srinu Movie - Sakshi

కొందరు దర్శకులకు, కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అయితే వాటిని బయటికి చెప్పరు. సింపుల్ గా సైలెంట్ గా ఫాలో అయిపోతుంటారు. ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇప్పుడు కొత్త సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. ఆ సెంటిమెంట్ ను రామ్ నటించే పాన్ ఇండియా మూవీకి అప్లై చేస్తున్నాడు.  

బోయపాటి మిగతా హీరోలతో తెరకెక్కించే సినిమాలు వేరు. బాలయ్యతో చేసే మూవీస్ వేరు. అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చిన ప్రతీసారి ఇండస్ట్రీ షేక్ అయింది. అయితే బాలయ్యతో ఎప్పుడు బోయపాటి సినిమా చేసినా నట సింహాన్ని డ్యూయర్ రోల్ చూసి బాక్సాఫీస్ ను బద్దలు కొడతూ వచ్చాడు.

(చదవండి: కొత్త సినిమాలతో కళకళలాడుతున్న ఓటీటీ వరల్డ్‌)

ముందు వచ్చిన సింహా ఆ తర్వాత వచ్చిన లెజెండ్, ఈ మధ్యే వచ్చిన అఖండలో బాలయ్యకు డ్యూయల్ రోల్స్ ఇచ్చాడు బోయపాటి. అయితే ఇతర హీరోలతో బోయ వర్క్ చేసినప్పుడు మాత్రం ఈ ఫార్ములా అప్లై చేయడు. దాంతో ఈ మధ్య కాలంలో ఒక్క సరైనోడు విషయంలో తప్పితే ప్రతీసారి ఫెయిల్యూర్ అవుతూనే వచ్చాడు. ఆఖరికి అఖండ ముందు రిలీజైన వినయ విధేయ రామాలో కూడా చరణ్ ను సింగిల్ రోల్ లో చూపించి పరాజయాన్ని అందుకున్నాడు బోయ.

అఖండ తర్వాత రామ్ మూవీతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు బోయపాటి. ఈసారి అస్సలు రిస్క్ తీసుకోదలచుకోవడం లేదు ఈ మాస్ డైరెక్టర్. అందుకే రామ్ మూవీ కోసం బాలయ్య సెంటిమెంట్ ను అప్లై చేస్తున్నాడట బోయపాటి. కొత్త చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ ను డ్యూయల్ రోల్ లో నటింపజేస్తున్నాడట. ఇదే రూమర్ నిజం కావాలని రామ్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement