Hero Ram Marriage Rumours: Ram Pothineni Gives Clarity Why He Is Response Deets Inside - Sakshi
Sakshi News home page

Ram Pothineni Marriage Rumours: ఇంట్లో వాళ్లు కూడా అనుమానించారు.. అందుకే స్పందించా: రామ్‌

Jul 12 2022 2:20 PM | Updated on Jul 12 2022 3:04 PM

Ram pothineni Gives Clarity Why He Is Responds On Marriage Rumours - Sakshi

గతంలో కూడా రామ్‌ పెళ్లిపై పుకార్లు వచ్చాయి.. కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఈ సారి మాత్రం ఆయనే స్వయంగా ట్వీట్‌ చేయాల్సి వచ్చింది.

టాలీవుడ్‌లోని మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ రామ్‌ పోతినేని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడనే పుకారు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. దీనిపై స్వయంగా రామ్‌ స్పందిస్తూ.. అది ఒట్టి పుకారేనని, అందులో నిజం లేదని కుండ బద్దలు కొట్టాడు. అయితే గతంలో కూడా రామ్‌ పెళ్లిపై పుకార్లు వచ్చాయి.. కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఈ సారి మాత్రం ఆయనే స్వయంగా ట్వీట్‌ చేయాల్సి వచ్చింది. దానికి కారణం ఏంటో తాజాగా రామ్‌ వివరించారు.

(చదవండి: స్కూల్లో ఓ అబ్బాయికి లవ్‌ లేటర్‌ రాశా, అది ఇంట్లో తెలిసింది..: సాయి పల్లవి)

‘సాధారణంగా హీరోయిన్లతో పెళ్లి అంటే.. ఇంట్లో వాళ్లు కూడా పెద్దగా పట్టించుకోరు. హీరో అన్నాక ఇలాంటి పుకార్లు రావడం కామన్‌లే అని లైట్‌ తీసుకునే వాళ్లు. కానీ ఈ సారి మాత్రం సీక్రెట్‌ చైల్డ్‌వుడ్‌ ఫ్రెండ్‌తో పెళ్లి అనేసరికి ఇంట్లో వాళ్లు కూడా అనుమానంగా చూడడం మొదలు పెట్టారు. ఫ్రెండ్స్‌ కూడా అనుమానించారు. మాములుగా అయితే ఇలాంటి రూమర్స్‌ని పెద్దగా పట్టించుకోని మా అమ్మ.. ‘ఏం లేకుండానే ఇలా రాస్తారంటావా?’ అని అనడంతో నేనే స్పందించాల్సి వచ్చింది. నేను స్కూల్‌కే రెగ్యులర్‌గా వెళ్లలేదు..అమ్మాయితో ఎలా ప్రేమలో పడతానని చెప్పడంతో అమ్మ రియలైజ్‌ అయింది’ అని రామ్‌ చెప్పుకొచ్చారు. 

కాగా, రామ్‌, కృతీశెట్టి జంటగా నటించిన ‘ది వారియర్‌’చిత్రం జులై 14న విడుదల కాబోతుంది. తమిళ డైరెక్టర్‌ లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం తర్వాత రామ్‌.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా మూవీ చేయబోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement