Sai Pallavi Reveals About Her Love Letter Issue In 7th Class, Deets Inside - Sakshi
Sakshi News home page

Sai Pallavi: 7వ తరగతిలో ఓ అబ్బాయికి లవ్‌ లేటర్‌ రాసి.. ఇంట్లో దొరికిపోయా..

Jul 12 2022 1:58 PM | Updated on Jul 12 2022 3:11 PM

Sai Pallavi Open Up On Her 7th Grade Love Letter Issue In Latest Interview - Sakshi

హీరోయిన్‌ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అందం, అభినయంతో పాటు తన డాన్స్‌తో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల విరాట పర్వంతో హిట్‌ కొట్టిన సాయి పల్లవి గార్గి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం జూలై 15న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న సాయి పల్లవి తాజాగా మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. విరాట పర్వం సినిమాలో హీరో భావాలు, అతని విప్లవాత్మక కవితలు నచ్చి లెటర్‌ రాశాను. ఈ సీన్‌ చేస్తున్నప్పుడు నా నిజ జీవితంలో నేను రాసిన ప్రేమలేఖ సంఘటన గుర్తొచ్చింది. నేను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయికి లవ్‌లెటర్‌ రాశాను. అయితే ఈ విషమం మా పేరెంట్స్‌కి తెలిసింది. అడ్డంగా దొరికపోడంతో ఇద్దరు కలిసి నన్ను బాగా కొట్టారు. ఆ రోజును ఇప్పటికి మరిచిపోలేను. లవ్‌ లేటర్‌ రాసేటప్పుడు ఈ విషయం మా పేరెంట్స్‌కి తెలుస్తుందని అనుకోలేదు. అది వారికి ఎలా తెలిసిందో కూడా తెలియదు’ అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. 

ఇక గార్గి మూవీ గురించి మాట్లాడుతూ.. తన మనుసుని బాగా కదిలించిన కథ ఇది అని పేర్కొంది. ‘ఫిదా, లవ్‌స్టోరి, విరాటపర్వం’ సినిమాల్లో తండ్రీకూతుళ్ల కథలో నటించాను. ఆ చిత్రాల్లో తండ్రితో కలిసి ఉండే పాత్ర నాది. కానీ ‘గార్గి’ చిత్రంలో భావోద్వేగం వైవిధ్యంగా ఉంటుంది. యుముడితో పోరాటం చేసి, సావిత్రి తన భర్త ప్రాణాలు దక్కించు కొన్నట్టు.. ఈ సినిమాలో నాకు దూరమైన నా తండ్రి కోసం న్యాయపోరాటం చేస్తాను. ఈ పాత్ర కోసం ఏం చేయాలి? ఎంత చేయాలి? అనే విషయాన్ని  దృష్టిలో పెట్టుకొని చేశాను’ అని చెప్పుకొచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement