Ram Charan Wife Upasana Konidela Shares Babymoon Video, Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Upasana Konidela: బేబీమూన్ ట్రిప్‌లో ఉపాసన- చెర్రీ.. సోషల్ మీడియాలో వైరల్

Mar 7 2023 6:16 PM | Updated on Mar 7 2023 7:17 PM

Ram Charan Wife Upasana Konidela Shares A video Of Babymoon - Sakshi

మెగా హీరో రామ్‌ చరణ్‌ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్‌ ఆస్కార్‌కు నామినేట్ కావడంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే గుడ్ మార్నింగ్ ‍అమెరికా షోలో చెర్రీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాజిక కార్యక్రమాలతో పాటు అన్ని ప్రోగ్రామ్స్‌లోనూ చురుగ్గా పాల్గొంటుంది. ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. త్వరలోనే తల్లి కాబోతున్న ఉపాసన అమెరికాలో చెర్రీతో పాటు సందడి చేస్తున్నారు. 

తాజాగా ఉపాసన, రామ్ చరణ్ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ జంట బేబీమూన్‌ను ఆస్వాదిస్తున్నారు. రామ్ చరణ్‌ బిజీ షెడ్యూల్‌లోనూ తన భార్య ఉపాసనతో కలిసి సరదాగా సముద్రంలో విహరించారు. షాపింగ్‌తో పాటు సముద్రంలో విహరిస్తున్న వీడియోను ఉపాసన తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ.. 'ఇంత బిజీగా ఉన్నప్పటికీ మా కోసం రామ్ చరణ్‌కు సమయం దొరికింది. డాల్ఫిన్స్, షార్క్స్ చూసేందుకు నన్ను తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు. నా బకెట్ జాబితాలో ఇది టిక్ చేస్తున్నా.' అంటూ ఫోటోలు, వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన చెర్రీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. క్యూట్ కపుల్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement