రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | Rakshit Shetty once again opened up about his breakup with Rashmika Mandanna - Sakshi
Sakshi News home page

Rashmika: రష్మిక గురించి మరోసారి మాట్లాడిన రక్షిత్.. ఏం చెప్పాడంటే?

Published Fri, Feb 16 2024 3:12 PM

Rakshit Shetty Comment On Marriage Cancelled With Rashmika - Sakshi

నిజమెంత అనేది పక్కనబెడితే కొందరి జీవితాలు వినడానికి ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి వారిలో రష్మిక ఒకరు. ఎందుకంటే సొంతభాష కన్నడలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది. అదే సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఏమైందో ఏమో గానీ పెళ్లి జరగలేదు. తాజాగా రష్మిక గురించి మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి మాట్లాడాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

(ఇదీ చదవండి: ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ రివ్యూ)

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రష్మిక.. ఈ మధ్య 'యానిమల్' చిత్రంతో అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది.  ఇ‍ప్పుడు ఈమె చేతిలో 'పుష్ప 2', 'రెయిన్ బో', 'గర్ల్ ఫ్రెండ్' లాంటి చిత్రాలున్నాయి. సరే సినిమాల సంగతి పక్కనబెడితే ఈమె గురించి మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి పలు వ్యాఖ్యలు చేశాడు. 

అప్పట్లో రష్మికతో ఎంగేజ్‌మెంట్, పెళ్లి ఆగిపోవడం గురించి తాజాగా మరోసారి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రక్షిత్ శెట్టి.. 'తమ పెళ్లి ఆగితే ఏంటి? తామిద్దరం ఇప్పటికే టచ్‌‌లోనే ఉన్నాం. రష్మికకు జీవితంలో పెద్ద డ్రీమ్‌ ఉండేది. ఇప్పుడు దాన్ని సాకారం చేసుకుంది' అని చెప్పుకొచ్చాడు. ఈ మాటల బట్టి చూస్తుంటే.. ప్రేమికులుగా విడిపోయినప్పటికీ ఫ్రెండ్స్‌గా రష్మిక-రక్షిత్ అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారనమాట.

(ఇదీ చదవండి: ఏడాది కిందట నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన హీరోయిన్‌)

Advertisement
 
Advertisement