ఏడాది కిందట నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

Arathi: ఇంటర్వ్యూ చేసింది.. ప్రేమలో పడింది.. త్వరలోనే ఏడడుగులు వేయనున్న హీరోయిన్‌

Published Fri, Feb 16 2024 1:29 PM

Dr Robin Radhakrishnan, Actress Arathi Announce Their Wedding Date - Sakshi

పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. ఎందరో ఇంట్ల పెళ్లి బాజాలు మోగనున్నాయి. సెలబ్రిటీలు కూడా బ్యాచిలర్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెడుతూ వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. దిల్‌ రాజు సోదరుడి కుమారుడు, రౌడీ బాయ్స్‌ హీరో ఆశిష్‌ రెడ్డి వాలంటైన్స్‌ డే రోజే పెళ్లి చేసుకోగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఫిబ్రవరి 21న ప్రియుడితో మెడలో మూడు ముళ్లు వేయించుకోనుంది.

నిశ్చితార్థం అయిన ఏడాదిన్నరకు పెళ్లి
తాజాగా మరో బ్యూటీ ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. నారాయణ అండ్‌ కో సినిమా హీరోయిన్‌ ఆరతి త్వరలో పెళ్లి చేసుకోనుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌ 26న వైవాహిక బంధంతో ఒక్కటి కానున్నట్లు తెలిపింది. కాగా ఈ జంట గతేడాది ఫిబ్రవరి 16న నిశ్చితార్థం చేసుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత అదే రోజు తమ పెళ్లి తేదీని వెల్లడించడం విశేషం.

అప్పటినుంచే లవ్‌..
మోడల్‌, నటి ఆరతి.. మలయాళ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ డాక్టర్‌ రాబిన్‌ రాధాకృష్ణన్‌ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన రాధాకృష్ణన్‌ను ఇంటర్వ్యూ చేసింది ఆరతి. అప్పుడు ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఆరతి హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకుంది.

చదవండి:  విశ్వక్‌ ఆడిషన్‌ ఇచ్చిన సినిమాకు నాగచైతన్య హీరోగా..

Advertisement
 

తప్పక చదవండి

Advertisement