'రాక్షస కావ్యం'తో అలాంటి ఎక్స్‌పీరియెన్స్: నిర్మాత శింగనమల కల్యాణ్ | Rakshasa Kavyam Movie Producer Kalyan Interview | Sakshi
Sakshi News home page

'రాక్షస కావ్యం' సినిమాతో అలాంటి ఎక్స్‌పీరియెన్స్: నిర్మాత శింగనమల కల్యాణ్

Oct 6 2023 7:03 PM | Updated on Oct 6 2023 7:03 PM

 Rakshasa Kavyam Movie Producer Kalyan Interview - Sakshi

విదేశంలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ నిర్మాత, ఫైనాన్షియర్‌గా శింగనమల కల్యాణ్ టాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 'భాగ్ సాలే' సినిమాని నిర్మించిన ఈయన లేటెస్ట్ మూవీ 'రాక్షస కావ్యం'. అభయ్, అన్వేష్ మైఖేల్, రోహిణి ప్రధాన పాత్రలు చేశారు. అక్టోబరు 13న థియేటర్లలోకి రానున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు షేర్ చేసుకున్నారు.

- చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ఇంట్రెస్ట్. ఉద్యోగం చేస్తున్నా..సినిమాల మీద ఇష్టం తగ్గలేదు. ఒకరోజు ప్రొడ్యూసర్ దామురెడ్డిని మధుర శ్రీధర్ రెడ్డి నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆయన కారణంగా 'రాక్షస కావ్య' సినిమాలో భాగమయ్యాను. 

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!)

- 'రాక్షస కావ్యం' కథ రా అండ్ రస్టిక్‌గా ఉంటుంది. రియల్ లైఫ్‌లో చూసిన దానికి దగ్గరగా ఉంటుంది. ఈ కథలో విలన్స్ గెలవాలి. ఎప్పుడూ హీరోలే ఎందుకు గెలవాలి అనే కామెడీ పాయింట్ కూడా కొత్తగా ఉంటుంది. మన సినిమాల్లో విలన్స్‌ను ఎలా తక్కువ చేసి చూపిస్తున్నారు, హీరోలను ఎలా హైప్ చేస్తున్నారు అని చెప్పే సరదా సీన్స్ ఉంటాయి.

- చిన్న సినిమాలకు ప్రొడక్షన్ ఎప్పుడూ రిస్కే. కొవిడ్ టైమ్‌లో ఓటీటీల వల్ల చిన్న సినిమాలకు లాభపడ్డాయి. కానీ ఇప్పుడు ఓటీటీలకు ఇవ్వాలంటే కష్టంగా ఉంది. కంటెంట్ బాగుండి, మౌత్ టాక్ స్ప్రెడ్ అయిన 'బేబి' లాంటి మూవీస్ హిట్ అవుతున్నాయి. సినిమా బాగుంటే ఓపెనింగ్స్ రాకున్నా తర్వాత కలెక్షన్స్ బాగుంటాయి.

(ఇదీ చదవండి: సర్జరీ వికటించి ప్రముఖ నటి కన్నుమూత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement