'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే! | Bigg Boss 7 Elimination 5th Week Priyanka Jain | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Elimination: అనుకోని ట్విస్ట్.. ఆమె ఎలిమినేట్ కానుందా?

Oct 6 2023 6:22 PM | Updated on Oct 8 2023 2:25 PM

Bigg Boss 7 Elimination 5th Week Priyanka Jain - Sakshi

బిగ్‪‌బాస్‌ తెలుగులో ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు. ఎందుకంటే గేమ్స్ గురించి పక్కనబెడితే ఇప్పటివరకు నాలుగు వారాల్లో నలుగురు లేడీ కంటెస్టెంట్స్ బయటకెళ్లిపోయారు. ఇప్పుడు ఐదోవారం కూడా టాప్ కంటెస్టెంట్ అనుకున్న ఆమెనే ఎలిమినేట్ కానుందనే న్యూస్ హాట్ టాపిక్ అవుతుంది. ఇంతకీ ఎవరామె? ఏంటి సంగతి?

ఆ బ్యాచ్‌పై నెగిటివిటీ
సాధారణంగా బయట పరిచయమున్నా సరే బిగ్‌బాస్ హౌసులోకి వచ్చిన తర్వాత ఎవరి గేమ్ వాళ్లే ఆడుతుంటారు. ఈసారి మాత్రం కలిసి వర్క్ చేసిన కొందరు సీరియల్ ఆర్టిస్టులు షోలో అడుగుపెట్టారు. తొలి ఎపిసోడ్ నుంచి గ్రూప్‌గానే ఆడుతున్నారు. ఇతర కంటెస్టెంట్స్ నుంచి ఇదే కంప్లైంట్ వచ్చినా సరే తాము సింగిల్‌గానే ఆడుతున్నామని చెప్పుకొచ్చారు. కానీ ప్రేక్షకుల్లో కాస్త నెగిటివిటీ వచ్చింది.

(ఇదీ చదవండి: సర్జరీ వికటించి ప్రముఖ నటి కన్నుమూత)

ప్రియాంక ఔట్?
గత మూడు నాలుగు వారాల్లో పవరస్త్ర గెలుచుకున్న సందీప్, శోభాశెట్టి, ప్రశాంత్ తప్ప మిగిలిన ఏడుగురు ఈ వారం నామినేట్ అయ్యారు. ఈ జాబితాలో ఓట్ల శాతం వారం మొత్తం పైకి కిందకు జరిగింది. శుక్రవారానికి వచ్చేసరికి శివాజీ టాప్‌లోనే ఉన్నాడు. తర్వాత స్థానాల్లో గౌతమ్, యవర్, శుభశ్రీ, టేస్టీ తేజ ఉన్నట్లు తెలుస్తోంది. చివరి రెండు స్థానాల్లో అమరదీప్, ప్రియాంక ఉన్నట్లు సమాచారం.

అయితే ఈ వారం నామినేషన్స్ తర్వాత తేజని దిగువన ఉన్నారు. కానీ కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న క్రమంలోనే తేజకు ఓటింగ్ శాతం పెరిగింది. దీంతో అమరదీప్, ప్రియాంకని వెనక్కి నెట్టి ఐదో స్థానానికి వచ్చేశాడు. దీంతో చివరి స్థానంలోని ప్రియాంకనే ఈసారి ఎలిమినేట్ కాబోతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: 'మంత్ ఆఫ్ మధు' రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement