ప్రేమించుకున్నారు.. గొడవపడ్డారు.. అంతా వాళ్లే!: హృతిక్‌ రోషన్‌ తండ్రి | Rakesh Roshan About Hrithik Roshan, Sussanne Khan Divorce | Sakshi
Sakshi News home page

ప్రేమించుకుందీ వాళ్లే.. పెళ్లయ్యాక గొడవపడింది వాళ్లే.. హృతిక్‌పై తండ్రి కామెంట్స్‌

Jan 30 2025 4:55 PM | Updated on Jan 30 2025 5:28 PM

Rakesh Roshan About Hrithik Roshan, Sussanne Khan Divorce

ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు.. తర్వాత విడాకులు తీసుకున్నవారు చాలామందే ఉన్నారు. ఆ జాబితాలో బాలీవుడ్‌ గ్రీక్‌గాడ్‌ హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan)- సుజానే (Sussanne Khan) దంపతులు కూడా ఉన్నారు. సినిమాల్లోకి రాకముందే హృతిక్‌ సుహానేను ప్రేమించాడు. 2000వ సంవత్సరంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదే ఏడాది ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టాడు. ఈ దంపతులకు హ్రెహాన్‌, హృదాన్‌ అని ఇద్దరు కుమారులు సంతానం. 

విడాకుల తర్వాత స్నేహితులుగా..
తర్వాత ఏమైందే ఏమో కానీ 2014లో హృతిక్‌- సుజానే విడిపోయారు. అలా అని శత్రువులుగా మిగిలిపోకుండా మంచి మిత్రులుగా తమ మధ్య అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం హృతిక్‌.. నటి సబా ఆజాద్‌తో ప్రేమలో ఉండగా సుజానే.. అర్స్‌లన్‌ గోనీతో లవ్‌లో ఉంది. ఈ రెండు ప్రేమ జంటలు తరచూ షికార్లకు, డిన్నర్‌ డేటింగ్‌కు వెళ్తూ మీడియాకు చిక్కుతూ ఉంటారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న హృతిక్‌- సుజానే విడిపోవడానికి కారణం ఏమై ఉంటుందన్నది చాలామందికి ప్రశ్నగానే మిగిలిపోయింది. 

(చదవండి: మొన్న హీరోయిన్‌ సన్యాసం.. ఇంతలోనే మరో కథానాయిక సోదరి కూడా)

విడిపోయినంత మాత్రాన..
తాజాగా దీనిపై హృతిక్‌ తండ్రి, దర్శకనిర్మాత, నటుడు రాకేశ్‌ రోషన్‌ (Rakesh Roshan) స్పందించాడు. ఆయన మాట్లాడుతూ..   జరిగిందేదో జరిగిపోయింది. విడిపోయినంత మాత్రాన సుజానే మాకు ఏమీ కాకుండా పోదు. ప్రేమించి పెళ్లి చేసుకుంది వాళ్లిద్దరు! అభిప్రాయభేదాలు వచ్చిందీ వారిమధ్యే! అప్పుడు దాన్ని పరిష్కరించుకోవాల్సిందీ వారిద్దరే! ఏదేమైనా తను ఇప్పటికీ మా ఇంటికి వస్తూ ఉంటుంది. తనను మా కుటుంబసభ్యురాలిగానే భావిస్తాం అని చెప్పాడు.

నేనంటే భయం
కుమారుడు హృతిక్‌, కూతురు సునయన గురించి చెప్తూ.. వీళ్లిద్దరికీ నేనంటే భయం. అదెందుకో నాకు తెలియదు. ఎవరిమీద పడితే వాళ్లపై అరిచేవాడినీ కాదు, అనవసరంగా తిట్టేవాడినసలే కాదు. కాకపోతే క్రమశిక్షణగా ఉంటాను. చిన్నప్పుడు ఈ పిల్లలిద్దరూ నాతో నిర్భయంగా మాట్లాడేవారే కాదు. కానీ ఇప్పుడు సరదాగా ఉంటారు. అందరం ఫ్రెండ్స్‌లా కలిసిపోయి మాట్లాడుకుంటాం అని చెప్పుకొచ్చాడు. రాకేశ్‌ రోషన్‌ ఫ్యామిలీపై ఇటీవల ద రోషన్స్‌ అని డాక్యుమెంటరీ రిలీజైంది. ఇకపోతే రాకేశ్‌ గతంలో గొంతు క్యాన్సర్‌తో పోరాడి గెలిచాడు.

చదవండి: 300 కోట్ల బడ్జెట్‌.. హీరోగా సూర్య లేదా చరణ్‌, నో చెప్పిన దర్శకుడు!

Advertisement
 
Advertisement
Advertisement