రెండు భాషల్లో రాజ్‌పుత్‌ | Rajput movie launch | Sakshi
Sakshi News home page

రెండు భాషల్లో రాజ్‌పుత్‌

Sep 17 2020 6:48 AM | Updated on Sep 17 2020 6:48 AM

Rajput movie launch - Sakshi

శంకర్‌ జాదవ్, అదిరే అభి హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘రాజ్‌పుత్‌’. సిరిరాజ్, కరిష్మారామ్‌ కథానాయికలు. బంజారా భాషలో ‘గోర్‌మాటి’, తెలుగులో ‘రాజ్‌పుత్‌’గా రెండు భాషల్లో నిర్మిస్తున్నారు రేఖ్యా నాయక్‌. శంకర్‌ జాదవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బుధవారం ప్రారంభమైంది. నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌ తొలి సన్నివేశానికి క్లాప్‌నివ్వగా, ‘టీమా’ సెక్రటరీ వి. తిరుమల దేవి కెమెరా స్విచాన్‌ చేశారు. లక్ష్మణ్‌ వేముల గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘బంజారాల జీవితం ఎక్కడ ప్రారంభమై ఎక్కడివరకు వెళ్లింది? వారి సమస్యలేంటి? అనే అంశాలతో తయారవుతున్న చిత్రమిది’’ అన్నారు హీరో, దర్శకుడు శంకర్‌.

Advertisement
 
Advertisement
Advertisement