రాజకీయాల్లోకి సూపర్ స్టార్ అల్లుడు.. ఎంట్రీ ఫిక్స్..! | Rajinikanth Son in Law Vaisagan Set for Political Entry | Sakshi
Sakshi News home page

Rajinikanth: రాజకీయాల్లోకి రజినీకాంత్ అల్లుడు.. ఎంట్రీ ఫిక్స్..!

Jun 10 2026 8:43 PM | Updated on Jun 10 2026 8:43 PM

Rajinikanth Son in Law Vaisagan Set for Political Entry

తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు సంచలనాలే వినిపిస్తుంటాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ ‍అనూహ్యంగా విజయం సాధించారు. ఏకంగా సీఎం కుర్చీపై కూర్చున్నారు. ఈ విజయంతో తమిళనాడు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని రుజువైంది. ద్రవిడ రాజకీయాల్లో సినీ గ్లామర్‌కు మంచి క్రేజ్ ఉంది. గతంలో ఎంజీఆర్‌ కూడా సినీ రంగ నుంచే సీఎం అయ్యారు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ సైతం ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈనెల 12న పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేయనున్నారు. 

అయితే తాజాగా సూపర్‌స్టార్, తలైవా అల్లుడు  వైశాగన్ పొలిటికల్ ఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తోంది. బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలైతో కలిసి అడుగులు వేయనున్నారని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. కె. అన్నామలై కొత్తగా ప్రారంభించిన 'వి ది లీడర్స్' ఉద్యమంలో  వైశాగన్ పాల్గొంటారని సమాచారం. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ టాపిక్‌ తమిళనాడుతో ఆసక్తికరంగా మారింది. ఇది రజినీకాంత్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం అన్నామలై ద్రవిడ నాట సరికొత్త రాజకీయశక్తిగా అవతరించనున్నారు. 

రజినీకాంత్ అల్లుడు వైశాగన్ అన్నామలే ఉద్యమంతో చేరడంపై తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మలుపు కానుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఆయనకున్న సంబంధం.. తమిళనాడులో వారి కుటుంబానికి ఉన్న పలుకుబడి వల్ల ఆయన రాజకీయ ఎంట్రీపై ప్రజల్లో చర్చ మొదలైంది. యువ ఓటర్లను ఆకర్షించేందుకు అన్నామలై చేస్తున్న ప్రయత్నాలకు వైశాగన్ చేరిక బలాన్ని చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. గతంలో రజనీకాంత్ స్వయంగా క్రియాశీల రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. వైశాగన్ పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement