మరోసారి రిస్క్‌ చేస్తున్న రాజశేఖర్‌.. వర్కౌట్‌ అయ్యేనా? | Rajasekhar to Star in Telugu Remake of Tamil Hit Lover Pandu | Sakshi
Sakshi News home page

మరోసారి రిస్క్‌ చేస్తున్న రాజశేఖర్‌.. వర్కౌట్‌ అయ్యేనా?

Sep 21 2025 2:21 PM | Updated on Sep 21 2025 2:39 PM

Rajasekhar Ready To Remake Of Tamil Blockbuster Lubber Pandhu

హీరో రాజశేఖర్‌(Rajasekhar) వెండితెరపై కనిపించి చాలా రోజులైంది. ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం ‘శేఖర్‌’. 2022లో ఈ మూవీ రిలీజైంది. ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రాలేవి ప్రేక్షకుల ముందుకు రాలేదు కానీ నితిన్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’(2023)లో క్యామియో రోల్‌ ప్లే చేసి ఆకట్టుకున్నాడు. చాలా కాలం తర్వాత రాజశేఖర్‌ మళ్లీ ఓ సినిమా చేయబోతున్నాడట. అది కూడా రీమేక్‌. తమిళ్‌లో పెద్ద హిట్‌ అయిన ‘లబ్బర్ పందు’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారట రాజశేఖర్.

హరీష్ కళ్యాణ్- దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన 'లబ్బర్ పందు' సినిమాను తమిళరాసన్ పంచముత్తు దర్శకత్వం వహించారు. గల్లీ క్రికెట్ బ్యాక్‍డ్రాప్‍తో వచ్చిన ఈ చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారట.

ఒరిజినల్‌లో దినేష్ చేసిన పాత్రను తెలుగులో రాజశేఖర్ చేస్తున్నారట. విశ్వదేవ్ రాచకొండ మాతృకలో అర్జున్ కళ్యాణ్ చేసిన పాత్రను చేస్తున్నాడట. రాజశేఖర్ తనయురాలే ఇందులో హీరోయిన్‌గా కనిపించనుందట.

రీమేక్‌తో రిస్క్‌.. 
ఓటీటీ వాడకం పెరిగిన తర్వాత రీమేక్‌ చిత్రాలేవి వర్కౌట్‌ కావడం లేదు. ఒక భాషలో హిట్టయిన సినిమాను..ఓటీటీలో అన్ని ప్రాంతాల వారు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజశేఖర్‌ రిస్క్‌ చేసి రీమేక్‌ చేస్తున్నాడు. ఒకప్పుడు ఆయన రీమేక్‌ చేసిన చిత్రాలన్నీ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. కానీ ఇప్పుడు పరిస్థితుల మారాయి. ఆయన రీమేక్‌ చేసిన గడ్డం గ్యాంగ్‌, శేఖర్‌ చిత్రాలు సైతం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. అయినా కూడా రాజశేఖర్‌ మళ్లీ రీమేక్‌నే నమ్ముకున్నాడు. మరి ఆయన రిస్క్‌ ఫలిస్తుందో లేదో చూడాలి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement