రాజ్‌ తరుణ్‌ నాకు అబార్షన్‌ చేయించాడు: లావణ్య | Raj Tarun Girlfriend Lavanya Again File Complaint On Malvi Malhotra | Sakshi
Sakshi News home page

Lavanya: రాజ్‌ తరుణ్‌ నాకు అబార్షన్‌ చేయించాడు: లావణ్య

Jul 10 2024 12:22 PM | Updated on Jul 10 2024 5:20 PM

Raj Tarun Girlfriend Lavanya Again File Complaint On Malvi Malhotra

హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరోసారి పోలీసులని ఆశ్రయించింది. తన మాజీ ప్రియుడితో పాటు హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపై మళ్లీ కేసు పెట్టింది. తనతో పాటు తన తమ్ముడిని లావణ్య బెదిరిస్తోందని మాల్వీ.. బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. లావణ్య ఇప్పుడు మరో కేసు పెట్టింది. దీనితో పాటు స్క్రీన్ షాట్స్, మరికొన్ని ఆధారాలని ఫిర్యాదుతో పాటు సమర్పించింది. ఈ క్రమంలోనే మరోసారి రాజ్ తరుణ్‌తో తన బంధం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.

(ఇదీ చదవండి: జైల్లో ఉండలేకపోతున్న హీరో దర్శన్.. అవన్నీ కావాలని రిక్వెస్ట్)

గత పదేళ్లుగా తాము కాపురం చేస్తున్నామని చెప్పిన లావణ్య.. కొన్నాళ్ల  క్రితం రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని చెప్పి షాకిచ్చింది. ఇందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్, వివరాలు సమర్పించింది. అయితే లావణ్య అని కాకుండా అన్విక పేరుతో తామిద్దరం కలిసున్నామనే చెప్పుకొచ్చింది. ఇదే పేరుతో విదేశాలకు కూడా వెళ్లొచ్చామని రివీల్ చేసింది. అయితే మాల్వీ వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనని దూరం పెట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది.

(ఇదీ చదవండి: హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలిపై మరో కేసు పెట్టిన హీరోయిన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement