జైల్లో ఉండలేకపోతున్న హీరో దర్శన్.. అవన్నీ కావాలని రిక్వెస్ట్ | Actor Darshan Files Petition In High Court For Home Food And Bed | Sakshi
Sakshi News home page

Darshan: హైకోర్టుకి వెళ్లిన హీరో దర్శన్.. ఆ విషయమై పిటిషన్

Published Wed, Jul 10 2024 12:02 PM | Last Updated on Wed, Jul 10 2024 1:06 PM

Actor Darshan Files Petition In High Court For Home Food And Bed

కన్నడ స్టార్ హీరో దర్శన్ జైల్లో ఉండలేకపోతున్నాడు. ఇన్నాళ్లు లగ్జరీ లైఫ్ బతుకుతూ వచ్చిన ఇతడు.. సాధారణ ఖైదీలా ఉండలనేసరికి తెగ ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇంటి ఫుడ్‌తో పాటు పలు సదుపాయాలు కావాలని రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఇంతకీ దర్శన్ కేసులో అప్‌డేట్ ఏంటి?

(ఇదీ చదవండి: ప్రభాస్ కోట్లాది రూపాయల సాయం.. బయటపెట్టిన కాస్ట్యూమ్ మాస్టర్)

కన్న హీరో దర్శన్‌ని గత నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. నటి పవిత్ర గౌడ సహా మొత్తంగా 17 మందిని అరెస్ట్ చేశారు. రేణుకస్వామి అనే వ్యక్తి దర్శన్‌కి వీరాభిమాని. అయితే తన అభిమాన హీరో భార్యతో కాకుండా ప్రియురాలు పవిత్రతో ఎక్కువగా ఉండటాన్ని తట్టుకోలేకపోయిన రేణుకాస్వామి.. ఈమెకు అసభ్య సందేశాలు పంపించాడు. ఇది ఈమె దర్శన్‌కి చెప్పడంతో తన మనుషులతో కలిసి రేణుకాస్వామిని చంపేశాడు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది.

ప్రస్తుతం జైల్లో ఉన్న దర్శన్.. మిగతా ఖైదీల్లానే ఉన్నాడు. కాకపోతే ఇతడికి అజీర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు. తనకు ఇంట్లో చేసిన ఆహారంతో పాటు పడుకోవడానికి పరువు, బట్టలు, పుస్తకాలు కావాలని రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. బుధవారం దీనిపై విచారణ జరగనుంది. మరి న్యాయస్థానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి?

(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా? ఆ స్పెషల్ డే నుంచి స్ట్రీమింగ్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement