పోలీసులతో పాటు మీడియా ముందుకు రాజ్ తరుణ్ | Raj Tarun To Attend Tiragabadara Saami Movie Promotions | Sakshi
Sakshi News home page

పోలీసులతో పాటు మీడియా ముందుకు రాజ్ తరుణ్

Jul 31 2024 3:34 PM | Updated on Jul 31 2024 4:02 PM

Raj Tarun To Attend Tiragabadara Saami Movie Promotions

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కొంత కాలం తర్వాత మీడియా ముందుకు వస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి రాత్‌ తరుణ్‌పై ఫిర్యాదు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. తనను ప్రేమించిన తర్వాత హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రాతో రాజ్‌ తరుణ్‌ ఎఫైర్‌ పెట్టుకొని మోసం చేశాడంటూ నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ క్రమంలో తనకు అబార్షన్‌ కూడా చేపించాడని ఆమె ఆరోపించింది.

రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన 'తిరగబడర స్వామి' సినిమాకు సంబంధించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. హైదరాబాద్‌లోని  ప్రసాద్ ల్యాబ్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి లావణ్య కూడా వస్తుందని సమాచారం ఉంది. తనకు జరిగిన అన్యాయం గురించి మీడియా ముందే రాజ్‌ తరుణ్‌ను నిలదీయాలని ఆమె అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఏమైన గొడవ జరిగే అవకాశం ఉందని పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు.

'తిరగబడర స్వామి' సినిమాలో మాల్వీ మల్హోత్రా, రాజ్‌ తరుణ్‌ జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని లావణ్య ఆరోపించింది. అయితే, తాజాగా జరగనున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రానికి మాల్వీ మల్హోత్రా కూడా వస్తుందా అనేది తేలాల్సి ఉంది.

లావణ్యపై ఫైర్‌ అయిన రాజ్‌ తరుణ్‌ స్నేహితుడు
'తిరగబడర స్వామి' సినిమా మీడయా సమావేశానికి రాజ్‌ తరుణ్‌ స్నేహితుడు  rj శేఖర్ బాషా కూడా హజరయ్యాడు. లావణ్య విషయంలో రాజ్‌ తరుణ్‌కు సంబంధించి ఎలాంటి తప్పులేదని ఆయన చెప్పాడు. ఈ విషయంలో తప్పంతా లావణ్యదే అంటూ ఆయన ఫైర్‌ అయ్యాడు. ఆమె గుండెకాయ మస్తాన్‌ వద్ద ఉందంటూ చెప్పుకొచ్చాడు. రాజ్‌ తరుణ్‌ను నిలదీసేందుకు ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని ఆమె వస్తుందని ప్రశ్నించాడు. 

అమె ప్రసాద్‌ ల్యాబ్‌ వద్దకు వస్తే ఆమె చేసిన తప్పుల గురించి కచ్చితంగా నిలదీస్తానంటూ ఆర్‌జే శేఖర్‌ ఫైర్‌ అయ్యాడు. అయితే, మరికొంత సమయంలో ప్రారంభం కానున్న ఈ మీడియా సమావేశానికి హీరోయిన్‌ మాల్వి మల్హోత్రాతో పాటు రాజ్‌ తరుణ్‌ ఇప్పటికే హజరయ్యారు. పోలీసులు సమక్షంలో ఈ మీడియా సమావేశం జరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement