సుమ, రాజీవ్‌ కనకాల ప్రేమ మొదలైంది అక్కడే: రాఘవేంద్రరావు | Raghavendra Rao Made Interesting Comments On Anchor Suma And Rajeev Kanakala Marriage, Deets Inside | Sakshi
Sakshi News home page

సుమ, రాజీవ్‌ కనకాల ప్రేమ మొదలైంది అక్కడే: రాఘవేంద్రరావు

Jan 23 2026 8:44 AM | Updated on Jan 23 2026 10:33 AM

Raghavendra Rao Comments On Suma And Rajeev Kanakala Marriage

కేరళకు చెందిన సుమ తన యాక్టింగ్‌, యాంకరింగ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. రాజీవ్‌ కనకాలను పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు అయిపోయింది. రాజీవ్ కుటుంబం మొత్తం సినిమా రంగంలోనే ఉంది. ఇప్పటికే వారి కుమారుడు రోషన్‌ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే, రీసెంట్‌గా ఒక వేదికపై సుమ, రాజీవ్‌ల పెళ్లి గురించి దర్శకుడు రాఘవేంద్రరావు పలు విషయాలను సరదాగ పంచుకున్నారు. 'శాంతి నివాసం' సీరియల్‌లో రాజీవ్ పాత్రను కేవలం బతికించి  తీసుకొని రమ్మని సుమకు చెప్పాను.. కానీ, పెళ్లి చేసుకోమని నేను చెప్పలేదు' అని నవ్వుతూ ఆయన అన్నారు.

రాజీవ్ కనకాల, సుమ 1999లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వారి పరిచయం సీరియల్స్‌తోనే మొదలైంది. అలా ప్రేమలో పడిన ఈ జోడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది.  ఒక సినిమా ఈవెంట్‌లో రాఘవేంద్రరావు మాట్లాడుతూ వారి పెళ్లి గురించి సరదా వ్యాఖ్యలు చేశారు. సుమ - రాజీవ్ కలిసి నటించిన సూపర్‌ హిట్‌ సీరియల్‌ 'శాంతి నివాసం' గురించి పలు జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు.

''శాంతి నివాసం' సీరియల్ 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న తర్వాత బాగా ఆడుతోందని కథను ఇంకా కొనసాగించాలని కోరారు. ఒక సినిమాకి శుభం కార్డు వేసిన తర్వాత..  మళ్లీ కొనసాగించాలంటే ఎలా అనేది ఆ సమయంలో నాకు తెలియలేదు. సరే అని కాస్త ఆలోచించాను. కథలో భాగంగా రాజీవ్‌ పాత్ర అప్పటికి చనిపోయి ఉంటుంది. అప్పుడు రాజీవ్‌ని బతికించి కథని కొనసాగిద్దాం అనుకున్నాం. లోయలో పడిపోయిన రాజీవ్‌ను ఆయుర్వేదం ట్రీట్మెంట్‌తో సుమ బతికించి పైకి తీసుకొస్తుంది. నేను పైకి తీసుకురమ్మని చెప్పాను గానీ.., పెళ్లి చేసుకోమని చెప్పలేదు. 

అయితే, వారిద్దరి మధ్య ఒక సాంగ్ షూట్ చేశాం. ఆ సమయంలోనే ఇద్దరూ అనుకున్నారు.. నెక్స్ట్ అనౌన్స్ మెంట్‌లో మ్యారేజ్ జరిగిపోయింది'' అంటూ కె.రాఘవేంద్రరావు  చెప్పారు. శాంతి నివాసం సీరియల్‌తో రాజీవ్‌, సుమల పెళ్లి అయిందని రాఘవేంద్రరావు ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ సీరియల్‌ అప్పట్లో భారీ హిట్‌ అయింది. రాజమౌళి దర్శకుడిగా రాఘవేంద్రరావు నిర్మాతగా దీనిని తెరకెక్కించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement