అంత అందంగా లేన‌న్నారు, వంక పెట్టారు: హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

Radhika Madan: నేనేమో అంద‌గ‌త్తెలా ఫీలవుతుంటే జ‌నాలు నాకే వంక పెట్టారు

Published Fri, Nov 3 2023 5:20 PM

Radhika Madan Recalls Facing Rejection for Her looks, Being Told Her Jaw is Crooked - Sakshi

హీరోయిన్లు ఎంతందంగా ఉన్నా స‌రే కొంద‌రు ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు. ముక్కు స‌రిగా లేదు, మూతి స‌రిగా లేదు, ప్లాస్టిక్‌ స‌ర్జ‌రీ చేయించుకుందేమో, అస‌లు త‌నెలా హీరోయిన్ అయింది? ఇలా నానామాట‌లు అంటూనే ఉంటారు. త‌న‌ను కూడా ఇలాగే సూటిపోటి మాట‌ల‌తో వేధించారంటోంది హీరోయిన్ రాధిక మ‌ద‌న్‌. కెరీర్ తొలినాళ్ల‌లో చాలామంది త‌న‌ను విమ‌ర్శించారంటోంది. 

క‌రీనా క‌పూర్‌లా ఫీలయ్యాను
తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రాధిక మ‌ద‌న్‌ మాట్లాడుతూ.. 'మొద‌ట్లో నేను హీరోయిన్ క‌రీనా క‌పూర్‌లా ఉన్నాన‌ని ఫీలయ్యాను. అలాంటిది జ‌నాలు నాకు వంక పెట్టారు. నీ ద‌వ‌డ కాస్త తేడాగా, వంక‌ర‌గా ఉంది.. దానివ‌ల్ల నువ్వేమీ అంత అందంగా క‌నిపించ‌ట్లేదన్నారు. నేనేమో క‌రీనా క‌పూర్‌లా ఫీల‌వుతుంటే ఇలా అంటున్నారేంటని షాక‌య్యాను. అయినా నా విలువ వీరికేం తెలుస్తుందిలే అని లైట్ తీసుకున్నాను. నా గురించి ఏదిప‌డితే అది రాస్తూ ఉంటారు. నా గురించి రాసిన ప్ర‌తీది చ‌దువుతాను.

అలాంటివి చ‌దివిన‌ప్పుడు బాధేసేది
కొన్నిసార్లు అవి హ‌ద్దులు మీరుతున్నాయ‌నిపిస్తుంది.. కానీ పెద్ద‌గా ప‌ట్టించుకోను. మ‌రికొన్నిసార్లు నా గురించి వ్య‌తిరేకంగా చాలా దారుణంగా ప్ర‌చారం చేస్తుంటారు. అలాంటి సంద‌ర్భాల్లో కొంత బాధ‌ప‌డ‌తాను.. నిజ‌మేంటో నిరూపించాలని త‌హ‌త‌హ‌లాడుతాను. కానీ సోష‌ల్ మీడియా వ‌చ్చాక అవి మ‌న జీవితాల‌ను చాలావ‌ర‌కు కంట్రోల్ చేస్తున్నాయ‌నిపిస్తోంది' అని చెప్పుకొచ్చింది. కాగా రాధిక చివ‌ర‌గా 'సాజిని షిండే కా వైర‌ల్ వీడియో' సినిమాలో న‌టించింది. ప్ర‌స్తుతం ఆమె చేతిలో సూర‌రై పోట్రు హిందీ రీమేక్ ప్రాజెక్ట్ ఉంది. ఇందులో అక్ష‌య్ కుమార్‌కు జంట‌గా న‌టించ‌నుంది. దీనితో పాటు స‌నా అనే సినిమా కూడా చేస్తోంది.

చ‌ద‌వండి: బిగ్‌ బాస్ విన్నర్‌ ఎల్విష్ యాదవ్‌కు షాక్..!

Advertisement
 

తప్పక చదవండి

Advertisement