పూరి సినిమాలో? | Radhika Apte to star opposite Vijay Sethupathi in Puri Jagannadh pan India film | Sakshi
Sakshi News home page

పూరి సినిమాలో?

Apr 16 2025 3:04 AM | Updated on Apr 16 2025 3:04 AM

Radhika Apte to star opposite Vijay Sethupathi in Puri Jagannadh pan India film

‘బెగ్గర్‌’ సినిమాలో భాగం కానున్నారట హీరోయిన్‌ రాధికా ఆప్టే. విజయ్‌ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘బెగ్గర్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే చిత్రం రానుంది. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్‌ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ జూన్‌లో ఆరంభం అవుతుంది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో టబు నటించనున్నారు.

తాజాగా రాధికా ఆప్టే నటించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. మరి... వార్తల్లో ఉన్నట్లు ఈ బ్యూటీ ఈ సినిమాలో భాగం అవుతారా? ఒకవేళ నటిస్తే... టబులానే ఆమె కూడా కీలక పాత్రలో కనిపిస్తారా? లేక హీరోయిన్‌గానా? అనేది త్వరలోనే తెలిసిపోతుంది.

Advertisement
 
Advertisement
Advertisement